సంజన వ్యాఖ్యలతో ‘బిగ్ బాస్’కి ఏమవుతుంది.?

108

‘బిగ్ బాస్ 2’ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన తొలి ఎలిమినేటర్ సంజ‌న‌ బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు రాగానే మీడియా ముందు వాలిపోయింది. బిగ్ బాస్ నుంచి తొంద‌ర‌గానే బ‌య‌ట‌కు వ‌చ్చేసాన‌న్న అసంతృప్తితో షో గురించి కొన్ని నెగెటీవ్ కామెంట్లు చేసింది.

 

ఈ షో నుంచి త‌న‌కు ఒక్క పైసా కూడా రాలేద‌ని, సెల‌బ్రెటీలు త‌న‌ని చిన్న చూపు చూసార‌ని, నాని హోస్ట్‌గా ప‌నిచేయ‌డని చాలా ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది. సాధార‌ణంగా నెగిటీవ్ వార్త‌లకే బ‌లం ఎక్కువ కాబ‌ట్టి సంజ‌న కామెంట్లు హాట్ టాపిక్‌ అయ్యాయి.  మరోవైపు బిగ్ బాస్ 2 క్రేజ్ అంతంత మాత్రంగానే ఉంది. సీజ‌న్ 1తో పోలిస్తే బోరింగ్‌గా ఉంద‌ని, సెల‌బ్రెటీల వ‌ల్ల జోష్ రావ‌డం లేద‌ని ప్రేక్ష‌కులు కూడా అభిప్రాయపడుతున్నారు.

సంజ‌న అనే కాదు బిగ్ బాస్ నుంచి తొంద‌ర‌గా బ‌య‌ట‌కు వ‌చ్చేసే వారు ఎవరైనా ఈ త‌ర‌హా కామెంట్లే చేస్తుంటారు. ఓ విధంగా బిగ్ బాస్ 2కి ఇది కూడా ప్ర‌చార ఆయుధ‌మే అవుతుంది. ఇలా నెగిటీవ్ కామెంట్ల వ‌ల్ల బిగ్ బాస్ లో ఏదో్ జ‌రుగుతోంది అనే ఉత్సుక‌త ప్రేక్ష‌కుల్లో క‌ల‌గ‌డం ఖాయం. ఇదంతా బిగ్ బాస్ నిర్వాహ‌కుల ఎత్తుగ‌డ కావొచ్చు. లేదంటే సంజ‌న ఫ‌స్ట్రేష‌న్ కూడా  కావొచ్చు. ఏదైనా బిగ్ బాస్‌ని లేపాలని నాని ట్రై చేసినా ఎన్టీఆర్ చేసిన‌ప్ప‌టి ఊపు క‌నిపించ‌డం లేదనేది వాస్తవం.