వేసవిలో ఉసూరుమనిపించిన సినిమాలు

127

వేసవికాలం అయిపోతుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. వేసవి ఫస్టాఫ్‌లో ‘రంగస్థలం’ అదరగొట్టింది. దుమ్మురేపే కలెక్షన్స్ రాబట్టింది. తర్వాత వచ్చిన ‘చల్ మోహనన్‌రంగ‌’, ‘కృష్ణార్జున యుద్ధం’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ‘భరత్ అనే నేను’తో వచ్చిన మ‌హేశ్‌బాబు బాక్సాఫీస్‌కి జోష్ అందించాడు. రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఓ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది.

ఏప్రిల్ ఎండింగ్ వరకూ రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు బంపర్ వసూళ్ళు సాధించాయి. అప్పటికి చాలామంది రెండిటినీ చూసేయడంతో మెజారిటీ థియేటర్ల నుంచి మైనారిటీ థియేటర్లకు షిఫ్ట్ అయ్యాయి. మే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిన సమ్మర్ సెకండాఫ్‌లో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ముందుగా థియేటర్లలోకి వచ్చింది. అల్లు అర్జున్ నటనకు పేరు వచ్చింది కానీ, సినిమాకి ఆశించిన వసూళ్ళు రాలేదు. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ సినిమా ఆకట్టుకోలేదు.

తర్వాతి వారం వచ్చిన ‘మహానటి’ మాత్రం విమర్శకులతో పాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపి భారీ విజయం సాధించింది. ‘ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా హిట్ కాలేదు. మెహబూబా, నేల టిక్కెట్టు, ఆఫీసర్, రాజుగాడు సినిమాలు బోల్తా కొట్టడంతో చూడటానికి థియేటర్లలో సరైన సినిమా లేదు. సెకండాఫ్ చప్పగా సాగిపోయాక క్లైమాక్స్‌లో ‘కాలా’ వచ్చి మరింత చప్పగా మార్చింది. ఇక వర్షాకాలంలో వచ్చే సినిమాలు వసూళ్ళ వర్షాలు కురిపిస్తాయో లేదో చూడాలి.