రేవ్ పార్టీలో ‘డాక్టర్లు’ ..అమ్మాయిలకు ‘హెచ్ఐవీ’ పరీక్షలు

307

శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సెలబ్రిటీ రిసార్ట్‌లోని ప్రైవేట్‌ విల్లాలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసారు. అమ్మాయిలతో కలిసి అశ్లీల కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడినవారిలో ఏడుగురు డాక్టర్లు, నలుగురు యువతులు ఉన్నారు. వీరందరినీ శామీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. రేవ్‌పార్టీలో పట్టుబడిన డాక్టర్లంతా గజ్వేల్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తేర్చారు. వీరంతా యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తూ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. వైద్యులు కావటం వలన తమతో అశ్లీలంగా గడపడానికి వచ్చిన అమ్మాయిలకు హెచ్ఐవీ టెస్ట్‌లు చేసారు.

హైదరాబాద్‌లో రెండేళ్ళ క్రితం మొదలైన రేవ్ పార్టీ కల్చర్‌ను ఎప్పటికప్పుడు పోలీసులు అణచివేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా సెలబ్రిటీ రిసార్ట్‌లో పెద్దఎత్తున జరపడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేసారు. ఓ ఫార్మా కంపెనీ తమ సొంత ఖర్చుతో డాక్టర్లకు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సాధారణంగా ఫార్మా కంపెనీలే కాకుండా, ఇతర వ్యాపార సంస్థలు కూడా గెట్ టు గెదర్ పార్టీలు ఇస్తుంటాయి.

రేవ్ పార్టీ అంటేనే విందు, మందు, పొందు అని అంటుంటారు. ఓ ఫార్మా కంపెనీ తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు దిగజారడంపై పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రేవ్ పార్టీని ఏ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసింది? పట్టుబడిన వైద్యుల పేర్లు వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు.