నేను ఆంధ్రుడిని-ఓడిపోను-LYRICAL TRIBUTE TO SPECIAL STATUS PROTEST

708

నేను వెనుకడుగు వేసానంటే దానర్థం ఓడిపోయాను అని కాదు…గెలుపు నన్ను దారి మళ్ళించింది

నేను అలిసిపోయాను అంటే దానర్థం నేను యుద్ధం చేయలేను అని కాదు….పద్ధతి ఇదికాదని అర్థమయ్యింది

నేను ఊరుకున్నాను అంటే దానర్థం నేను ఆగిపోయాను అని కాదు…నా వ్యూహం నా తప్పుని వేలెత్తి చూపింది…….

హక్కుగా నేనడిగింది నీకు చులకనైన వేళ నా నడకే  నన్ను వెక్కిరించింది

నిన్ను అందలం ఎక్కించడానికి ఈ నడకే కదా పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్ళిందని………

స్వేచ్చగా నా గొంతుని వినిపించలేని దుర్భర నిస్సహాయత బేలగా నవ్వుకుంటోంది

నా సిరా గుర్తు నిన్ను గెలిపించినప్పుడు  గొంతు పగిలేలా కేకలెందుకు వేసావని……

ఈ రోజు నేను నీకు అలుసయ్యాను,

నా హక్కును అడిగినందుకు నీకు కంట్లో నలుసయ్యాను……..

కానివ్వు, రాష్ట్రం విడిపోయినప్పుడే తట్టుకున్న గుండె ఇది

తుపాకీల మడమలకు ఖాకీ బూట్ల చప్పుళ్ళకు బెదరదు……….

ఈ రోజు గెలుపు నీదే, కాని అది నా గెలుపుకి మొదటి మెట్టు

నీ పతనానికి తొలి అక్షరం దిద్దించావు, ఓటు అనే కలం బలం నాకు తోడుందనే విషయం మర్చిపోయి………

ఏదీ మర్చిపోను అధ్యక్షా

మాట మార్చిన తోడేళ్ళ రెండు నాలుకల మాటలని

పందులన్న అహంకార మంత్రుల నోటి దురుసుని

అరెస్ట్ పేరుతో మమ్మల్ని భయపెట్టిన అధికారాన్ని

నేను చెప్పిందే వేదం అన్న అహంకారాన్ని

విద్యార్థి శక్తిని తక్కువ అంచనా వేసిన మదాన్ని

ఏదీ మర్చిపోను…..

నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, జగన్ కాదు, సంపూర్నేష్ కాదు, జయప్రకాశ్ కాదు, శివాజీ కాదు…..

నా పేరు ఆంధ్రుడు ….. తెలుగు నా కులం..,. తెలుగువారు నా బలం…..

ఇంతకు ఇంతా జరిగిన అవమానాన్ని లెక్క గట్టి మరీ బదులు తీరుస్తా…………

నేను ఆంధ్రుడిని…నేను ఓడిపోను…జై హింద్

రచన: శ్రీరాజ్ రవీంద్ర