భాజపాను వ్యతిరేకించటమే ఆంధ్రపదేశ్ చేసిన నేరమా.!

195

వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్న కేంద్రం మరోసారి ఏపీని అవమానించింది. తెలంగాణకు రూ.450 కోట్లను విడుదల చేసి ఏపీ విషయాన్ని పెండింగ్ లో పెట్టింది.

తెలంగాణకు వెనుకబడిన జిల్లాలకు చెల్లించాల్సిన నిధుల కింద రూ. 450 కోట్లను వారం క్రితమే విడుదల చేసింది. నిధులు విడుదల చేసిన వారానికి ఉత్తర్వులు రిలీజ్ చేసారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ ఏడాది మార్చిలో మొత్తం ఏడు జిల్లాలకు విడుదల చేసిన 350 కోట్లను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అంతకుముందు విడుదల చేసిన నిధులకు సంబంధించిన యూసీలు, ఖర్చుల వివరాలు అందించని కారణంగా వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం గతంలో వెల్లడించింది.

తక్షణమే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలాఖరు కల్లా యూసీలు, ఖర్చుల వివరాలను అందించింది. ఈ నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకోవడం అంటే ఏపీని అవమానించడమేనని తెదేపా తీవ్ర స్థాయిలో నిరసన తెలిపింది. విభజన చట్ట ప్రకారం రాయలసీమలో 4, ఉత్తరాంధ్రలో మూడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. అదీ మధ్యప్రదేశ్‌-యూపీ బుందేల్‌ఖండ్‌, ఒడిసా కేబీకే తరహా ప్యాకేజీ ఇవ్వాలి. కానీ జిల్లాకు యాభై కోట్ల చొప్పున విడుదల చేస్తున్నారు. అవి కూడా మూడేళ్లు ఇచ్చి నాలుగో ఏడు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు.

అసలు ఏపీ ఖాతాలో నిధులు వేసిన తర్వాత ప్రధానమంత్రి అంగీకరించలేదన్న కారణంగా వెనక్కి తీసుకున్నారు. తర్వాత యూసీలు సమర్పించలేదని కారణంగా చెప్పారు. అసలు యూసీలు సమర్పించిన తర్వాతే నిధులు విడుదల చేస్తారని చేసిన తర్వాత వెనక్కి తీసుకోవడం ఏమిటని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనిపై మరింతరాజకీయ రగడ చోటు చోటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.