నీలాంబరి స్నేహంతో ‘అరవింద’కు చేదోడు వాదోడుగా..

125

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా చుట్టూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రంలో సునీల్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. చిత్ర ఆడియో వేడుకలో సునీల్ మాట్లాడుతూ తాను ఎన్ని వేషాలు వేసినా తనకో మంచి వేషం ఇవ్వడానికి త్రివిక్రమ్ ఉన్నాడనే ధైరం తనలో ఉందని అన్నాడు.

అదే నమ్మకాన్ని నిజం చేస్తూ త్రివిక్రమ్, సునీల్ కోసం అద్భుతమైన పాత్ర రాసాడట. సాధారణంగా సునీల్ అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది వినోదమే. హీరో కంటే ముందు కమెడియన్‌గా ఎన్నో సినిమాల్లో నవ్వించాడు. సునీల్ కడుపుబ్బా నవ్వించడమే కాదు కంటతడి కూడా పెట్టించగలడు. ఎమోషనల్ సన్నివేశాలను అద్భుతంగా చేస్తాడు. అందుకని, సునీల్‌లో కామెడీనీ, ఎమోష‌న్‌నీ త్రివిక్ర‌మ్ బాగా వాడేసాడ‌ని అంటున్నారు.

‘అరవింద సమేత’లో నీలాంబరి పాత్రలో సునీల్ నటించాడు. సినిమాలో వీరరాఘవతో పాటు ట్రావెల్ చేసే నీలాంబరి పాత్ర తొలుత  నవ్వించి విషాదకర ఘటనతో ముగుస్తుందట. అతడి పాత్ర కథలో మలుపుగా ఉంటుందని, న‌టుడిగా సునీల్‌కి మంచి పేరు తెస్తుంద‌ని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రేమిట‌న్న‌ది చూచాయిగా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇందులో వీరరాఘవ అరవిందకి బాడీగార్డ్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఒక ప్ర‌మాదం నుంచి క‌థానాయిక‌ని కాపాడ‌డంతో వీరరాఘవని రాయ‌ల‌సీమ తీసుకెళ్ళటం, అక్కడికెళ్ళాక వీరరాఘవకు ఆ ప్రాంతంతో ఉన్న సంబంధం బయటకు రావటం జరుగుతుందట. సునీల్ (నీలాంబరి) న‌డుపుకుంటున్న గ్యారేజీలో ఎన్టీఆర్ (వీరరాఘవ) సునీల్‌కి చేదోడు వాదోడుగా ఉంటాడ‌ని తెలుస్తోంది.