కోలుకుంటున్న నవ్వుల రేడు ..ఆరోగ్యం మెరుగ్గా ఉంది

1284

1985లో  ‘అహ నా పెళ్ళంట’ సినిమాతో తెలుగు తెరౖపై నవ్వులు పూయించిన బ్రహ్మానందం అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు. దాదాపు వెయ్యిచిత్రాలు చేసిన బ్రహ్మానందం ఇటీవలే ‘గ్రేట్‌ తెలుగు లాఫ్టర్‌ చాలెంజ్‌’ షోతో బుల్లితెర ప్రేక్షకులను పలకరించారు.

బ్రహ్మానందం గుండె నొప్పితో హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్‌ని సంప్రదించారు. డాక్టరు సలహాతో ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయింది. ‘ఆదివారం ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో బ్రహ్మానందంగారిని ఆస్పత్రిలో జాయిన్‌ చేసాం. ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది’ అని బ్రహ్మానందం కుటుంబ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మానందం తనయుడు, హీరో గౌతమ్‌ ఓ ప్రకటన విడుదల చేసారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

‘నాన్నగారికి శస్త్ర చికిత్స జరిగిందని తెలిసి  అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు అందరూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయటం మొదలు పెట్టారు. అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు వల్ల  నాన్నగారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది, వారందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు.