జగన్ యువభేరి మీద మరోసారి విషం కక్కిన క్షుద్రజ్యోతి

244

కేసులనుంచి రక్షణ కోసం మోడీ, కోవింద్ ల కాళ్ళు పట్టుకున్నాడని, వెంకయ్యకు మద్దతు ప్రకటించాడని, ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ప్రకటించి మాట తప్పాడని, మడమ తిప్పాడని జగన్ మీద ఈరోజు జగన్ బద్ధశత్రువు క్షుద్రజ్యోతి ఛానెల్ చెప్పలేనంత అక్కసు వెళ్లగక్కింది.

ప్రత్యేకహోదా పదేళ్ళపాటు ఇవ్వాల్సిందే అని పార్లమెంట్ సాక్షిగా పిడికిళ్లు బిగించి నినదించిన బీజేపీ నాయకుడు వెంకయ్య, వెంకన్న సాక్షిగా పదేళ్లు కాదు పదిహేనేళ్ళు ఇవ్వాల్సిందే, హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి అని ఊళలు వేసిన చంద్రబాబు, వెంకయ్య, పవన్ కల్యాను ఈ క్షుద్ర కీచురాళ్ళ దృష్టిలో తిరగళ్ళు తిప్పుతున్నసంగతి తెలియదా? అధికారం రాగానే, ఓటుకు నోటు కేసులో ఇరుక్కోగానే, పైన మోడీ సర్వంసహా చక్రవర్తి కాగానే నాలుకలు కోసేసుకున్నారో లేక పేగులను మడతేసుకున్నారో, పంచెలు విప్పి ప్రాణభయంతో ముడుచుకునిపోయారో క్షుద్రజ్యోతికి తెలియకపోవడం ఆశ్చర్యం.

కేవలం ఎంపీల రాజీనామాలు వాయిదా వేసినంతమాత్రాన కేసులకు భయపడి వేశారు అని దుర్గంధభూయిష్టమైన వాగుడు వాగేవారు… కేసుల కత్తులు మెడపై వేలాడుతున్నా, కేంద్రానికి ఆగ్రహం కలుగుతుందేమో అన్న జంకు గొంకు కూడా లేకుండా, ప్రత్యేక హోదా నినాదాన్ని సింహనాదంగా వినిపించిన యువనాయకుడు మడమ తిప్పిన వాడా?

కేసీయార్ కొరడా ఝళిపించగానే, పాంటులో మూత్రవిసర్జన చేసుకుని కేసీయార్ కాళ్ళు పట్టుకున్న వీరి చరిత్ర ఎవరికీ తెలియదు? కేసీయార్ కు రాసుకుని పూసుకుని తిరుగుతూ కేసీయార్ కృపాకటాక్ష వీక్షణాలకోసం చెత్తపలుకుల్లో నాలుకలు మడతేసుకుని ముత్యాలముగ్గులో రావుగోపాలరావు వెనుక తిరిగే మృదంగ వాయిద్య కారుల్లా చిడతలు వాయిస్తున్న అర్భకులు ఎవరు?

ABN Andhrajyothi Radha Krishna spill venom on Jagan Special Status fightజగన్ యువభేరి మీద మరోసారి విషం కక్కిన క్షుద్రజ్యోతి

వీరికి కావలసింది తమ కులనాయకులు, తమ అవినీతికి, దోపిడీకి సహకరించే నాయకులు గద్దెమీద ఉండాలి. వారి పాదపీడనంతో ఆంధ్రాలో ఎకరాలకు ఎకరాలు భూములు నయాపైసలకు కొట్టెయ్యాలి. అందుకోసం వీరు ఎంత హీనస్థితికైనా దిగజారుతారు. వారి అశుద్ధాన్ని కూడా అమృతంలా స్వీకరిస్తారు.

చావో బతుకో ఒకడు తెగించి పోరాడుతున్నాడు. చావైతే అతని ఒక్కడిదే. బతుకైతే యావద్ రాష్ట్రానిది అని గ్రహించండి. ఇలాంటి దగుల్బాజీ మీడియా ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ బాగుపడదు.

రేపు పరిస్థితి అటూ ఇటూ అయితే అతను జైలుకు పోతాడు. పార్లమెంట్ లో వెర్రివాగుడు వాగి బయటకు రాగానే చెత్తబుట్టలో కక్కేసిన ఒక్కడైనా జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాడా?

– ఇలపావులూరి మురళీ మోహన రావు