అమలైతేనే కదా నెరవేరినట్లు..

48

ఎన్నిక‌లు వ‌చ్చే నాటికి తానిచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేదనే మాట రాకుండా ప్ర‌ధాన‌మైన హామీలకు ప‌చ్చ‌జెండా ఊపిన‌ ఆంధ్రా సిఎం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేరిపోయాయంటూ చెప్ప‌డం మొదలెట్టారు. కాపుల‌ను బిసీల్లోకి చేర్చ‌డం, నిరుద్యోగ‌భృతిపై నిర్ణ‌యం నేప‌ధ్యంలో తామిచ్చిన హామీల్లో పెండింగ్ ఏమీ లేన‌ట్టు మాట్లాడుతున్నారు. తాము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేర్చినట్లుగా చెప్పారు.

 

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని ఎవ‌రూ అడ‌గ‌లేద‌ని అన్నారాయ‌న‌. పాద‌యాత్ర చేసినప్పుడు బిసిల్లో చేరుస్తామ‌నే హామీ ఇచ్చామన్నారు. ఈ విష‌యంలో గ‌త ప్ర‌భుత్వాలు జీవోలు జారీ చేసినా అవి ఆచ‌ర‌ణ‌కు నోచుకోలేద‌న్నారు. జ‌స్టిస్ మంజునాధ క‌మిష‌న్ 4 నుంచి 5శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల్సిందిగా సూచించింద‌ని చెప్పారు. ఇత‌ర కులాల‌కు ఇబ్బందుల్లేకుండా కాపుల‌ను బిసిల్లో చేర్చామ‌న్నారు. అలాగే అగ్ర‌వ‌ర్ణాల్లోని పేప‌ద‌ల‌కు కూడా న్యాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

మేనిఫెస్టోలో అత్యంత ప్ర‌ధాన‌మైన హామీల‌ను విప‌క్షం స‌భ‌లో లేని స‌మ‌యం చూసి చ‌క్క‌బెట్టేసిన తెదేపా, హామీలు వాస్త‌వ‌రూపం దాల్చ‌డంపై దృష్టి సారించాల్సి ఉంది. మొత్తంగా రిజ‌ర్వేష‌న్లు 50శాతం దాట‌కూడ‌ద‌నే సుప్రీంకోర్టు ఆదేశాలున్న ప‌రిస్థితుల్లో బాబు ప్ర‌భుత్వం ఈ రిజ‌ర్వేష‌న్లు ప‌క్కాగా అమ‌ల‌య్యేందుకు త‌గిన ప‌రిష్కార మార్గం క‌నిపెడితేనే హామీ నెర‌వేరుతుంది. తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసేసి కేంద్రానికి పంపించేస్తే మాత్రం ఇబ్బందే.

SHARE