జాతీయ పత్రికలకు, జాతి పత్రికలకు ఎంత తేడా!

212

Difference between national news papers and Andhra news papersఒకేరోజు ఒకే కంపెనీపై వార్త….జాతీయపత్రికలకు, తెలుగు పత్రికల కథనాలుకు మధ్య తేడా చూడండి.

ల్యాంకో ఇన్ ఫ్రాటెక్ వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు బాకీ పడ్డ మెత్తం 43, 000 కోట్లు. RBI చర్య తీసుకోబోతున్న 12 కంపెనీల్లో ఒకటి. Bankruptcy and insolvency నిబంధనలు కింద.

ఇక తాజాగా మధ్యప్రదేశ్ లో PFC (Power Finance corporation) మరియు IDBI బ్యాంకు వద్ద తీసుకున్న 5500 కోట్ల రుణాలను తిరిగి చెల్లించనందువల్ల బ్యాంకు గ్యారెంటీలను encash చేయడానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్ హైకోర్టు కూడా ఈ చర్యను సమర్దించింది.

ఆర్థిక సంస్థలను, బ్యాంకులను నష్టపరుస్తున్న ఈ పనికి మాలిన సంస్థ పై అటు RBI ఇటు హైకోర్టు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

సరిగ్గా ఇదే సమయంలో మన రాష్ట్రంలో చంద్రబాబు వైజాగ్ మెడిటెక్ జోన్ నిర్మాణం పనులు ల్యాంకోకు ఇచ్చారు. 500 కోట్లతో పూర్తయే పనికి 2432 కోట్లు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని బయటకు చెప్పిన సంస్థ ఉద్యోగిపై కేసు పెట్టారు. సంస్థ విషయాలు బయటకు చెప్పడం అనేది తప్పని. హడావుడిగా పూనం మాలకొండయ్య గారి చేత అంతా సవ్యంగానే ఉందని చెప్పించారు. ఆమె చేత చెప్పిస్తే తప్పు జరగలేదని అందరూ అనుకొంటారు గదా. సత్య హరిశ్చంద్రుడు చేతకూడ అబద్దం పలికించగల నేర్పరులు మనవాళ్లు.

Difference between national news papers and Andhra news papersదివాలా తీయబోతున్న ఓ కంపెనీకి అత్యధిక లాభం వచ్చేట్లు ఒప్పందం చేసుకోవడమే ఓ తప్పు. అది ప్రజా ధనంతో ఆ సంస్థను ఒడ్డున పడేయడానికి చేసిన పని. ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలు తీర్చాలని లేదు. గత మూడేళ్లుగా రుణమాఫీ చేస్తూనే ఉన్నారు. గిట్టుబాటు ధర కల్పించలేరు. ఎక్కువ ఎవరు పండించమన్నారు అంటారు. పంట పోతే బీమా పరిహారం రెండేళ్ల తర్వాత వస్తుంది.

కానీ కార్పోరేట్ల ను ఆదుకోవాలని మాత్రం ఆత్రుత పడుతుంది. ల్యాంకో ఇన్ ఫ్రాటెక్ రాజగోపాల్ కు తెరవెనకగా జరుగుతున్న లబ్ధిగా దీనిని చెప్పవచ్చు. కాంగ్రెస్ ను వదిలేసినందుకో ! తెదేపాను బలపరచబోతున్నందుకో! కాలమే చెప్పాలి.

Difference between national news papers and Andhra news papersల్యాంకో దివాలా గురించి ఈనాడు దినపత్రిక ప్రముఖంగా ఎక్కడా చెప్పదు. ఇక మెడిటెక్ జోన్ పై వచ్చినవి కేవలం ఆరోపణలగా వార్త ఇచ్చారు. స్వయంగా పూనం తో ఖండన ప్రకటన ఇప్పించారు. మరోవైపు జాతీయ దినపత్రికలు ఆ కంపెనీ దివాలా గురించి, బ్యాంకు గ్యారెంటీలను నగదుగా మార్చడం గురించి చెప్పాయి.

ఇక బూతుజ్యోతి పత్రిక గురించి చెప్పడం ఎందుకు? రివర్స్ లో జగన్ పన్ను ఎగవేత గురించి వార్త ఇచ్చారు ఈరోజు. (నిన్నటి ఈనాడులో తెలుగు రాష్ట్రాలలో అత్యధిక పన్ను ఎగవేతదారుల లిస్ట్ ఇచ్చారు. అందులో లేని భారతి సిమెంట్ పేరు బూతుజ్యోతి కి కనబడింది!) సాక్షి పత్రిక మాత్రమే మెడిటెక్ జోన్ పనులు అధిక ధరలకు కట్టబెట్టడాన్ని తప్పు పట్టింది.

– శ్రీనివాసరావు పొన్నెకంటి