విశ్వాసఘాతకుడు అన్న పదానికి సరైన నిర్వచనం హన్సారి

468

నీటిలో కొట్టుకుని పోతున్న వృశ్చికాన్ని బయటకు తీస్తే తీసినవాడిని కుడుతుంది. చావుబతుకుల్లో ఉన్న సర్పాన్ని బ్రతికించండి. మొదటగా వాడినే కాటువేస్తుంది. ఉపకారికి అపకారం చెయ్యడం ఆ క్షుద్రజీవుల సహజగుణం.

ఇండియన్ ఫారిన్ సర్వీస్ నుంచి రిటైర్ ఆయన వ్యక్తి హమీద్ అన్సారీ ని కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఉపరాష్ట్రపతి చేసింది. పదేళ్ళపాటు అధికారభోగాలు అనుభవించాడు. ఏనాడూ తాను ముస్లిం ను అని, తనను ఈ దేశం గౌరవించింది అని చెప్పుకోలేదు. భారతజాతీయ పతాకానికి వందనం చెయ్యలేదు. పదవీకాలం ముగియగానే రాష్ట్రపతి పదవిని ఆశించాడు. కానీ, బీజేపీ ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇవ్వాలని రూల్ లేదు. ఉపరాష్ట్రపతిగా చేసినవారు అందరూ రాష్ట్రపతులు కాలేదు. రాజ్యసభ చైర్మన్ గా హన్సారి ఊడబొడిచింది ఏమీ లేదు. పదేళ్లు చేసినా కనీసం తనదంటూ ఒక ముద్ర ఏర్పరచుకోలేకపోయాడు.

గత పదేళ్లలో ముస్లిమ్స్ మీద కొన్ని దాడులు జరిగాయి. అయినా సరే ఈ పెద్దమనిషి నోరు విప్పలేదు. ముస్లిమ్స్ కు అనుకూలంగా మాట్లాడలేదు. తీరా ఆశించిన పదవి రాకపోయేసరికి ఎనభైఏళ్లు దాటినా వృద్ధాప్యంలో “ఈ దేశంలో ముస్లిమ్స్ కు రక్షణ లేదు. ముస్లిమ్స్ అభద్రతాభావం తో జీవిస్తున్నారు” అని కాలకూట విషాన్ని విరజిమ్మేడు ఈ దౌర్భాగ్యుడు.

Hamid Ansari shamefull comments on safety of muslims in Indiaవిశ్వాసఘాతకుడు అన్న పదానికి సరైన నిర్వచనం హన్సారి

పాకిస్తాన్ ముస్లిం దేశం. ఆ దేశంలో హిందువులకు ఎలాంటి రాజకీయపదవులు దక్కవు. అసలు పోటీ చేసే అవకాశమే రాదు. కానీ భారతదేశం మతాతీత, కులాతీత లౌకిక వ్యవస్థ. ఈ దేశంలో జన్మించిన ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా ఎలాంటి పదవులు అధిష్టించడానికైనా అర్హుడు. జాకీర్ హుస్సేన్,ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్, అబుల్ కలాం భారతదేశ రాష్ట్రపతులయ్యారు. ఇక పాకిస్తాన్ లో జన్మించిన దిలీప్ కుమార్ ను భారతదేశం అగ్రశ్రేణి కళాకారుడిని చేసింది. ఇవాళ్టి సూపర్ స్టార్స్ షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల కులం, మతం ఏమిటో మనం ప్రశ్నించలేదు. మహమ్మద్ రఫీ అన్ని మతస్తుల హృదయాల్లో చిరంజీవి. ఎవడ్రా ఈ దేశంలో ముస్లిమ్స్ కు రక్షణ లేదన్నది?

కాశ్మీర్ లో హిందూ పండితులను ఊచకోత కోస్తున్నది ఎవరు? భారతదేశ పార్లమెంట్ మీద దాడిచేసింది ఎవరు? ముంబాయిలో పేలుళ్లకు కారకులు ఎవరు? అమెరికా, బ్రిటన్, ఫరాన్స్, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఉగ్రవాదంతో విధ్వంసం సృష్టిస్తున్నది ఎవరు? ఏ మతస్తులు? ఫారిన్ సర్వీస్ వెలగబెట్టిన హన్సారీకి తెలియదా? ముస్లిమ్స్ కు రక్షణ లేదా? లేక ముస్లిమ్స్ నుంచి హిందువులకు రక్షణ లేదా? హిందువులు, ముస్లిమ్స్ భాయి భాయి అంటూ ఎంత సౌహార్ద్రంగా జీవిస్తున్నారు మనదేశంలో? ముస్లిమ్స్ ఎల్లప్పుడూ శాంతికాములు. ఈదేశంలో పుట్టిన ప్రతివాడూ భారతీయుడు తప్ప, హిందువో, ముస్లిమ్, క్రైస్తవుడో కాదు. ఈ మతాలు మనం సృష్టించుకున్నవే తప్ప దేవుడు సృష్టించినవి కాదు. భారతదేశం ఏ ఒక్కడి సొత్తూ కాదు. భిన్నత్వంలో ఏకత్వ పరిమళాలతో వికసిస్తున్న గులాబీ మన దేశం.

భారతదేశం కంటే శాంతికాముకదేశం ప్రపంచంలో మరొకటి ఉన్నదా? పదవి రాకపోయేసరికి మతి చెడి నోరు గతి తప్పింది ఈ వృద్ధ మూర్ఖుడికి. హన్సారి లాంటి వాళ్ళు భారతదేశానికే కళంకం. మతాల మధ్య చిచ్చు పెట్టె ఇటువంటి క్షుద్రులను దేశం నుంచి తరిమికొట్టాలి.

ఇలాంటి విశ్వాసహీనుడిని పదేళ్ళపాటు మోసినందుకు భారతదేశం సిగ్గు పడాలి.

– ఇలపావులూరి మురళీ మోహన రావు