రివ్యూ : ఇంటెలిజెన్స్ లేని ‘ఇంటెలిజెంట్’

104
వివి వినాయక్ దర్శకత్వం వహించిన ‘ఇంటిలిజెంట్’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథేమంటే..
తేజ (సాయి ధరమ్) ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగి. ఆ సంస్థ అధినేత నాజర్ చాలా మంచివాడు. అనాధలను ఆదుకుంటూ, ఉద్యోగలను జాగ్రత్తగా చూసుకుంటూ వుంటాడు. దేవ్ గిల్ అండ్ కో లకు చెందిన మాఫియా ముఠా కన్ను ఆ కంపెనీని బలవంతంగా స్వాధీనం చేసుకోవాలనుకుంటారు. అలాంటి టైమ్ లో ధరమ్ అడ్డం పడతాడు. కానీ ఉన్నట్లుండి కంపెనీ ఆ ముఠా పేర రాసి నాజర్ ఆత్మహత్య చేసుకుంటాడు. దాంతో ఆ ముఠా పని పట్టడానికి ధర్మా భాయ్ గా మారతాడు తేజ.
ఎలా ఉందంటే ..
మాస్ సినిమా అంటే ఇదే అన్నట్లు సినిమాలు తీసిన వివి వినాయక్ ‘ఇంటిలిజెంట్’ సినిమాను తీసాడంటే నమ్మలేదు. ప్రారంభం నుంచే సినిమా చాలా పేలవంగా వుంటుంది. హీరో, ఫ్రెండ్స్ మధ్య సీన్లు చూస్తుంటే నాటకానికి ఎక్కువ సినిమాకు తక్కువ అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల పరిచయం, అమ్మ-కొడుకుల అనుబంధం సీన్ ఒక్కొక్కటిగా నీరసాన్ని పెంచుతాయి. హీరో ధర్మాభాయ్ గా మారిన తరువాత కథ ఏకంగా అందని పరుగులు పెడుతుంది. ఎవరెవరి డబ్బులో ఎవరెవరికో చేరిపోయి, అసలు విలన్ రంగంలోకి దిగిపోతాడు. ఇలాంటి సీన్ల మధ్యలో కేవలం పాటల కోసం తీసుకున్న హీరోయిన్ వస్తుంది.
ఎవరెలా..
సాయిధరమ్ నటన, డ్యాన్స్ లు ఎప్పట్లానే చేసాడు. లావణ్య డ్యాన్సులు, గ్లామర్ కోసమే. ఇక బ్రహ్మానందం కామెడీ చూసి ఆయన వైభవం గుర్తుకువచ్చి అయ్యో అనిపిస్తుంది. సినిమా మొత్తం మీద ఏ ఒక్క సాంకేతిక అంశం గురించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు.
ఫైనల్ గా..
సినిమా పేరులో న్యూమరాలజీ లెక్కలు చూసుకున్నవారు మేకింగ్ లో చూసుకోలేదు.