భాజపా కోసం తెరాస అభ్యర్ధులు త్యాగాలు చేస్తున్నారా.?

46

తెలంగాణ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలో గ్రేటర్‌లో పోటీ చేస్తున్న ఇద్దరు తెరాస అభ్యర్థులు అనారోగ్యం సాకుతో వెళ్లి ఆస్పత్రిలో చేరిపోయారు.

చివరి క్షణంలో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ముఠాగోపాల్ టిక్కెట్ వచ్చిన తర్వాత చల్లబడిపోయారు. ఐదు రోజుల కిందట ప్రగతి భవన్‌లో కేటీఆర్‌తో సమావేశానికి వెళ్ళి వచ్చి నేరుగా ఆస్పత్రిలో చేరిపోయారు. ప్రగతిభవన్‌ బాత్‌రూంలో పడిపోయారని అందుకే ఆస్పత్రిలో చేర్పించామని ముఠాగోపాల్ అనుచరులు చెప్పుకొచ్చారు.

అయితే దీని వెనక భాజపా హస్తం ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ముషీరాబాద్ లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తెదేపాతో పొత్తు ఉంది కాబట్టి లక్ష్మణ్ బయటపడ్డారు. కానీ ఈసారి ఎవరి పొత్తు లేదు. అందుకే రాష్ట్ర అధ్యక్షుడే ఓడిపోతే నవ్వుల పాలు కావాల్సి వస్తుందని తెరాసను లైట్ తీసుకోమని భాజపా హైకమాండ్ కోరిటన్లు తెలుస్తోంది. ఇదే విధంగా గోషా మహల్ నియోజకవర్గం కూడా ఉంది.

తెరాస తరపున బరిలోకి దిగిన ప్రేమ్ సింగ్ రాథోడ్‌ భాజపా మాజీ ఎమ్మెల్యే. రాజాసింగ్‌కు పడాల్సిన ఓట్లు చీలుతాయన్న ఉద్దేశంతో ఆయన్ను కూడా ఆస్పత్రికి పంపించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ముఖేష్ గౌడ్ గోషామహల్ లో రంగంలో ఉన్నారు. రాజాసింగ్ ను ఓడించాలంటే అది ముఖేష్ గౌడ్ వల్లే సాధ్యమని నమ్ముతున్నారు. ముస్లింలతో ముఖేష్ గౌడ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే రాజాసింగ్‌ బయటపడాలంటే తెరాస అభ్యర్థి ఆస్పత్రిలో చేరాల్సిదేనని డిసైడయ్యారు.