రివ్యూ : ‘గాయత్రి’ వరకూ ఓకే.!

106
విల‌క్ష‌ణమైన న‌టుడు మోహ‌న్ బాబు ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘గాయత్రి’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఆ నలుగురు తర్వాత పెద్దగా గుర్తుండే సినిమా తీయని మదన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ అరుదైన కలయికలో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథేమంటే ..
రంగస్థల కళాకారుడు శివాజీ (మోహ‌న్‌బాబు) నిజ జీవితంలో ఎవ‌రికైనా జైలు శిక్ష ప‌డితే వారిస్థానంలోకి వేషం మార్చి ఆ శిక్ష అనుభ‌వించి వ‌స్తాడు. అలా చేయగా వచ్చిన ఆ డ‌బ్బుతో అనాథాశ్ర‌మం నిర్వ‌హిస్తుంటాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య శార‌ద (శ్రియ‌) ఓ బిడ్డ‌ను ప్ర‌స‌వించి చ‌నిపోతుంది. ఆ బిడ్డ చిన్న‌ప్పుడే త‌ప్పిపోతుంది. త‌న బిడ్డ కోసం అన్వేష‌ణ సాగిస్తూ ఉండగా గాయత్రి పటేల్ (మోహన్ బాబు) శివాజీని కిడ్నాప్ చేస్తాడు. గాయహ్త్రి పటేల్ శివాజీని ఎందుకు ఎత్తుకెళ్ళాడు. శివాజీ అతని కూతుర్ని కలిసాడా.? అనేదే మిగిలిన క‌థ‌.
ఎలా ఉందంటే ..
ఇదో రీమేక్ క‌థ‌. పక్క భాష నుంచి డ‌బ్బులిచ్చి కథని కొనుక్కొచ్చారు. ఓ డ్రామా ఆర్టిస్టు డ‌బ్బుల కోసం, ర‌క‌ర‌కాల వేషాలేసుకుని, ఎవ‌రి బ‌దులుగానో శిక్ష అనుభ‌విస్తుంటాడు. ఓసారి ప్ర‌తినాయ‌కుడి స్థానంలో తాను జైలుకి వెళ్ళాల్సి వ‌స్తుంది. వారి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ మొద‌లవుతుంది. అందులోంచి హీరో ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడ‌న్న‌ పాయింట్ చుట్టూ అల్లిన కథ. ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ  శివాజీ మంచి త‌నాన్ని పేజీల కొద్దీ వివ‌రిస్తూ టైమ్ వేస్ట్ చేసారు. క‌థేమీ లేన‌ప్పుడు వినోదానికి ప్రాధాన్యం ఇవ్వాలి. విశ్రాంతి త‌ర‌వాత ఫ్లాష్ బ్యాక్ వ‌స్తుంది. ఈ క‌థ‌లో గాయ‌త్రి ప‌టేల్ ఎంట్రీ ఇచ్చేంత వ‌ర‌కూ ఓ మెలిక‌గానీ, మ‌లుపు గానీ రాలేదు. గాయ‌త్రి ప‌టేల్ వేసిన ఉచ్చులోంచి శివాజీ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడ‌నే స‌న్నివేశాలు బాగానే ఉన్నాయి. కాక‌పోతే 134 మంది మ‌ర‌ణానికి కార‌ణ‌మైన గాయ‌త్రి ప‌టేల్ చివ‌రి కోరిక తీర్చాల్సిందే అంటూ జ‌నాలు ఆందోళ‌న చేయ‌డం, ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ల‌లో అదో ఉద్య‌మంగా న‌డ‌వ‌డం సిల్లీగా ఉంది. ఇప్ప‌టి రాజ‌కీయ నాయ‌కుల‌పై మోహ‌న్ బాబు వేసిన సెటైర్లు ఆక‌ట్టుకుంటాయి. సార్వ‌భౌమాధికారం అని ప‌ల‌క‌డం రాని వాళ్ళే మ‌న పాల‌కులు అంటూ ఇప్ప‌టి ప్ర‌జాప్ర‌తినిధుల తీరు ఎండ‌గ‌ట్టారు. వీలున్న‌ప్పుడ‌ల్లా రాజ‌కీయాల్ని, రామాయ‌ణ మ‌హాభార‌తాల్ని ప్ర‌స్తావిస్తూ డైలాగులు పేల్చారు.
ఎవరెలా..
క‌థ‌ని ప్రేక్ష‌కుల్ని ఎంగేజ్ చేస్తూ, ఎంట‌ర్‌టైన్‌మెంట్ పండిస్తూ చెప్ప‌డంలో మ‌ద‌న్ దారి త‌ప్పాడు. మోహ‌న్‌బాబు ద్విపాత్రాభిన‌యం య‌ధావిధిగానే ఉంది. గాయ‌త్రి ప‌టేల్‌ పాత్రలో ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ సినిమాని గుర్తు చేసాడు. గతంలో మోహ‌న్‌బాబుగా విష్ణు కనిపించటం కొత్త ప్రయోగం. శ్రియ పాత్ర‌ తెర‌పై పెద్దగా క‌నిపించ‌లేదు. అనసూయ జ‌ర్న‌లిస్టుగా క‌నిపించింది. ఈ క‌థ మ‌ద‌న్‌ది కాదు. మాట‌లూ తాను రాయ‌లేదు. అందుకే ఈ క‌థ‌ని ఓన్ చేసుకోవ‌డానికి క‌ష్ట‌ప‌డ్డాడేమో అనిపిస్తుంది.
ఫైనల్ గా..
కొంత గాయత్రి పటేల్ కోసం ..పొలిటిక‌ల్ పంచ్‌ల కోసం…