వీరత్వంతో ‘వినయ విధేయ రామ’ వచ్చేసాడు

194

మెగా అభిమానులు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. రంగస్థలం తరువాత మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా టైటిల్‌ మరియు ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

దీపావళి కానుకగా ‘వినయ విదేయ రామ’ పేరును సినిమాలో రాంచరణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసారు. టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగా బోయ‌పాటి ట్రెడీష‌న‌ల్ లుక్‌తో షాక్ ఇస్తాడ‌నుకున్నారు. కానీ స్టైల్‌కి త‌గ్గ‌ట్టుగా మాస్ లుక్‌నే దింపాడు. ఫైట్ సీన్‌లో వీర, రౌద్ర ర‌సాలు పండిస్తున్న చ‌ర‌ణ్ లుక్‌ని ఫ‌స్ట్ లుక్‌గా విడుద‌ల చేసింది.

దాదాపు 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. ఈ సినిమాలో చెర్రీకి జోడిగా కియారా అ‍ద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ నటుడు ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌లు కీలకపాత్రల్లో నటిస్తుండగా వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.