‘మాస్’కి ఓకే మరి ‘ఫ్యామిలీస్’ కనెక్ట్ అవుతారా.?

110

రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వినయ విధేయ రామ’. కియారా అద్వానీ నాయికగా నటిస్తున్న ఈ సినిమా సెన్సార్‌ కంప్లీట్‌ చేసుకుంది. ఈ నెల 11న విడుదల కానున్న ఈ చిత్రం 2గంటల 26 నిమిషాల నిడివి ఉందని సమాచారం.

తాజాగా ఈ సినిమాలోని ‘రామా లవ్స్‌ సీత’ పాట ప్రోమోను విడుదల చేసారు. సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ సినిమా పూర్తి స్థాయి మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమా కావటంతో అంచ‌నాలు భారీ స్థాయిలో ఉన్నాయి. రంగ‌స్థ‌లం త‌ర‌వాత చ‌ర‌ణ్ నుంచి వ‌స్తున్న సినిమా కాబ‌ట్టి తిరుగులేని ఓపెనింగ్స్‌ తెచ్చుకోవ‌డం ఖాయం. కాక‌పోతే ‘రంగ‌స్థ‌లం’లా కుటుంబ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ సినిమాకి ద‌క్కుతుందా, లేదా? అనే ప్ర‌శ్న‌లు మొద‌ల‌వుతున్నాయి.

ఈ సినిమా గురించి రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘సినిమా పూర్తి స్థాయి మాస్‌ ఫిల్మ్‌లా ఉంటుంది. మంచి కుటుంబ కథా చిత్రం కూడా. బ్యూటిఫుల్‌ అండ్‌ బ్యాలెన్డ్స్‌ క్యారెక్టర్‌ చేసాను. కియారా కళ్ళతో మంచి హావభావాలు పలికించగలదు. మంచి డ్యాన్స్‌ పార్టనర్‌. ‘రామా లవ్స్‌ సీత’ సాంగ్‌ విజువల్‌గా హైలైట్‌గా ఉంటుంది. ప్రశాంత్, స్నేహ, వివేక్‌ ఒబెరాయ్‌ గార్లతో పనిచేయడం నాకు లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. పెద్ద సినిమాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన దానయ్య గారితో సినిమా చేస్తే హోమ్‌ బ్యానర్‌ కొణిదెల ప్రొడక్షన్స్‌లో చేసినట్లే ఉంటుంది. బోయపాటిగారు మంచి కన్విక్షన్‌తో సినిమా చేసారు’ అన్నాడు.

టీజ‌ర్, ట్రైల‌ర్ల‌లో చ‌ర‌ణ్ చొక్కా విప్పి, గ‌న్ను ప‌ట్టి మ‌రీ భీక‌ర‌మైన పోరాట‌లు చేస్తున్నాడు. ఈ సినిమాలో యాక్ష‌న్ డోసు మ‌రీ ఎక్కువ‌గా ఉంద‌ని, ద్వితీయార్థంలో హింస‌, రక్త‌పాతం ఏరులై పారుతుంద‌న్న‌ది సెన్సార్ రిపోర్ట్‌. అలాంటి స‌న్నివేశాలు మాస్ మెచ్చినా.. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని దూరం చేస్తుంటాయి. సినిమా రికార్డులు సృష్టించాల‌న్నా, బిజినెస్‌కి త‌గిన వ‌సూళ్ళు సాధించాల‌న్నా కుటుంబ ప్రేక్ష‌కుల మ‌ద్ద‌తు కావాలి.