కాంబో అదిరింది గురు….విశాల్ సాహసం

473

విశాల్ సినిమాలు ఎలా ఉన్నా అతని సినిమాలు ఫస్ట్ డే చూసే మాస్ జనాలు బాగానే ఉన్నారు. తమిళ్ లో ఇప్పటికే స్థిరమైన మార్కెట్ సృష్టించుకున్న విశాల్ తెలుగులో కూడా గట్టి జెండా పాతాలని తెగ ట్రై చేస్తున్నాడు కాని కుదిరి చావటం లేదు. పందెం కోడి సూపర్ హిట్ కావడం ఆపై పొగరు నుంచి భరణి దాకా బాగానే ఉంది మనోడి ఇమేజ్. కాని సెల్యూట్ సినిమాతో మొదలు కొని క్రమక్రమంగా చార్మ్ కోల్పోయాడు విశాల్. అతని సినిమా కొనాలంటే కాస్త ముందు వెనుక చూసుకునే పరిస్థితి. రాయుడు ఓవర్ మాస్ డోస్ తో తుస్సుమంటే ఈ మధ్య వచ్చిన ఒక్కడోచ్చాడు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మిగిలింది. అంతకు ముందు వచ్చిన జయసూర్య, కథాకలి, ఇంద్రుడు, పల్నాడు అన్నింటిది ఇదే రిజల్ట్. ఏమి తేడా లేదు. నడిగర్ సంఘం వ్యవహారాల్లో పడి కెరీర్ ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనే విమర్శలు కూడా ఉన్నాయి. శరత్ కుమార్ కుమార్తె వర లక్ష్మి తో ప్రేమాయణం కూడా బెడిసి కొట్టి ఇద్దరి మధ్య అయితే ప్రస్తుతానికి గ్యాప్ ఉంది. త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే విషయం గురించి ఎలాంటి అప్ డేట్స్ లేవు.

విశాల్ హీరోగా తనను తాను ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కొత్తగా విలన్ గా ట్రై చేయాలనీ డిసైడ్ అయ్యాడట. మోహన్ లాల్ హీరోగా మలయాళం, తమిళ్ లో రూపొందే ద్విభాషా చిత్రంలో విశాల్ విలన్ గా నటించబోతున్నాడు అనేది ఇప్పుడు హాట్ న్యూస్ అయ్యింది. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉందని అందుకే ఏమి ఆలోచించకుండా ఓకే చెప్పాడట. హీరో తో సమానంగా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ కావడంతో విశాల్ ఈ కొత్త ఛాలెంజ్ టేకప్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇందులో తెలుగు హీరో శ్రీకాంత్ కూడా ఓ ప్రాధాన్యత ఉన్న పాత్ర చేయబోతున్నట్టు సమాచారం. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, జగపతి బాబు తో నటించిన అనుభవం ఉన్న మోహన్ లాల్ మరో స్టార్ హీరో తో అందులోనూ అతన్ని విలన్ గా చూపించే సినిమాతో రానుండటం విశేషం. మార్చ్ నుంచి షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. తెలుగు వెర్షన్ మాత్రం డబ్ చేస్తారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రెండు బాషలలో ఇప్పటికే ఇది విని బజ్ పెరిగిందని వార్త. సో వన్ అఫ్ ది బెస్ట్ కాంబో త్వరలోనే చూడబోతున్నాం.