ఇట్స్ కన్ఫర్మ్ ..నటి ‘అనీషా’తో విశాల్ వివాహం

737

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అనీషాతో హీరో విశాల్‌ వివాహం చేయబోతున్నట్లు ఆయన తండ్రి, నిర్మాత జీకే రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అనీషా గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి కనబరిచారు.

ఈ నేపధ్యంలో అనీషా సంక్రాంతి పండగ రోజున వివాహ బంధానికి సంబంధించిన ప్రకటన చేసింది. విశాల్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

బిజినెస్‌మేన్‌ విజయ్‌ రెడ్డి, పద్మజల కుమార్తె అయిన అనీషా అర్జున్‌ రెడ్డి, పెళ్ళిచూపులు వంటి చిత్రాల్లో నటించారు. ఇకపై ఆమె సినిమాల్లో కొనసాగుతుందో లేదో చూడాలి. ఈ సందర్భంగా విశాల్‌పై తనకున్న ఇష్టాన్ని, నమ్మకాన్ని వెల్లడించారు.

గతంలో తన పెళ్ళి గురించి వచ్చిన వార్తలపై విశాల్‌ స్పందిస్తూ  నా పెళ్ళి గురించి వార్తలు ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదు. ఇది మంచిది కాదు. ఇది నా వ్యక్తిగత జీవితం. నా పెళ్ళి గురించి అధికారికంగా ప్రకటించడం కంటే సంతోషం ఏముంటుంది. త్వరలోనే ఆ వివరాలు ఆనందంగా ప్రకటిస్తానని పేర్కొన్న విశాల్ తాజాగా అనీషతో తన పెళ్ళి గురించి అధికారిక ట్వీట్ చేస్తూ నా జీవితంలో పెద్ద మార్పు ఈమేనంటూ అనీష పిక్ షేర్ చేసాడు.