కమల్ మరోసారి ‘విశ్వరూపం’ చూపిస్తాడా.?

100

ఎట్ట‌కేల‌కు కమల్ హాసన్ ‘విశ్వ‌రూపం 2’కి అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. విడుద‌ల చేయ‌డ‌మే త‌రువాయి కావటంతో ఆగ‌స్టులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ నేపధ్యంలో ప్ర‌మోష‌న్ల‌ను కూడా మొద‌లెట్టింది. అందులో భాగంగా ‘విశ్వ‌రూపం 2’ ట్రైల‌ర్ విడుదల చేసారు. దేశ‌భ‌క్తి, టెర్ర‌రిజం చుట్టూ క‌థ నడిపారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది.

మ‌తం తాలుకూ విశ్వాసాల‌నూ ప్ర‌శ్నించ‌చారని అర్థ‌మ‌వుతోంది. ఇందులోనూ యాక్ష‌న్‌కి ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు. ఆండ్రియాను వీలైనంత కీలక పాత్ర ఇచ్చినట్లు అర్థ‌మ‌వుతోంది. యాక్ష‌న్ ప‌రంగా, రొమాన్స్ ప‌రంగా మంచి సీన్లు కమల్ హాసన్ మరియు కథానాయికల నుండి ఆశించొచ్చు. విశ్వ‌రూపం-1 అప్ప‌ట్లో వివాదాస్ప‌దమైంది. కొన్ని చోట్ల ప్ర‌ద‌ర్శ‌న‌లకు నోచుకోలేదు. మరి కమల్ ఈ సినిమాని వివాదాల‌కు దూరంగా తీర్చిదిద్దాడా, లేదా అనేది సినిమా వచ్చాకే తెలుస్తుంది.