రిలయన్స్ డిఫెన్స్ ముందర ‘హిందూస్థాన్ ఏరోనాటిక్స్’ పనికిరాదా.?

109

రాఫెల్ డీల్ విషయంలో ఎటువంటి కుంభకోణం జరగలేదని సమర్థించుకోవడానికి భాజపా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ వేదికగా ఆ ఒప్పందాన్ని సమర్థించుకుంటూ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు.

వాస్తవానికి రాపెల్ డీల్ లో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ ను కాదని అనిల్ అంబానీకి చెందిన సంస్థను ఎందుకు అఫ్ సెట్ పార్టనర్ గా చేర్చుకున్నారేదే పప్రధాన ఆరోపణ. యుద్ధ విమానాల తయారీ కంపెనీ ఎంపిక అంటూ వాదిస్తున్నప్పటికీ ఈరోజు పార్లమెంట్ లో మాత్రం హెచ్ఏఎల్ పనికి మాలిన సంస్థ అని నిర్మలా సీతారామన్ వాదించారు. ఆ సర్టిఫికెట్ కాదని కాంగ్రెస్ పార్టీనే ఇచ్చిందని చెప్పుకొచ్చారు. భారత్‌లో 108 విమానాల తయారీకి దసాల్‌ గ్యారంటీ ఇవ్వని హిందూస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ కోసం కాంగ్రెస్‌ మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు.

ఆ సంస్థ లోపాల్ని కాంగ్రెస్‌ ప్రస్తావించడం లేదని తమ హాయాంలో హిందూస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసామని చెప్పారు. హిందూస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ ఏడాదికి కేవలం 8 తేజస్‌ విమానాల్ని మాత్రమే తయారుచేయగలదని తేల్చారు. 43 విమానాలు ఆర్డరిస్తే హిందూస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ కేవలం 8 విమానాలే అందజేసింది చెప్పుకొచ్చారు. రాఫెల్‌ తయారీ హాల్‌ జన్మ హక్కు కాదు కదా? అంటూ ప్రశ్నించారు.

హిందూస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ ను.తీసి పడేసిన నిర్మలా సీతారామన్ ఒక్క విమానం తయారు చేసిన అనుభవం కూడా లేని అనిల్ అంబానీ కంపెనీ అంత పెద్ద కాంట్రాక్ట్ ను ఎలా అందుకుందో మాత్రమే చెప్పలేదు. భూమి కూడా లేని రిలయన్స్ డిఫెన్స్ విమానాలను ఎలా తయారు చేస్తుందో వివరణ ఇవ్వలేదు.!