అనుష్క ఎదురుచూపు ఎందుకోసమో.?

151
తన సింగిల్ స్టామినాపై యాబై కోట్లు తీసుకొచ్చేయగల లేడీ సూపర్ స్టార్ అనుష్క. ‘భాగమతి’ సినిమా దీనికి మంచి ఉదాహరణ. చాలా కాలం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉండిపోయిన ఈ సినిమా ఇప్పటివరకూ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్. తొలిప్రేమ, ఛలో సినిమాలతో కుర్రహీరోలు సందడి చేసినా అనుష్క ముందు తక్కువే.
నాలుగు భాషల్లో పట్టున్న అనుష్క  టాలీవుడ్ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో భాగమతితో ఓ ట్రెండ్ సెట్ చేసేసింది. వసూళ్ళు పరంగా తన అరుంధతి రికార్డ్ తనే బ్రేక్ చేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాల రికార్డులు అన్నీ అనుష్క సొంతమయ్యాయి. సినిమాకి హిట్ టాక్ వస్తే చాలు యాభైకోట్లు గ్యారంటీ ఇవ్వగలిగే స్టార్ అనుష్క. అయితే అలాంటి అనుష్క ఎందుకో సినిమాలు చేయడంలో వేగం తగ్గించేస్తుంది. యాబై కోట్లు తెచ్చిన హీరోయిన్ మళ్ళీ సైలంట్ అయిపోయింది.
బాహుబలి తర్వాత కొత్త సినిమాకి సైన్ చేయలేదు అనుష్క. భాగమతి, బాహుబలి సమయంలో సైన్ చేసిందే. దాదాపు పదముడేళ్ళుగా సినిమాలు చేస్తుంది అనుష్క. బాహుబలి తర్వాత నేషనల్ స్టార్. అంత క్రేజ్, స్టామినా వున్న అనుష్క నుండి మరిన్ని సినిమాలు ఆశిస్తారు. అయితే అనుష్కలో మాత్రం ఆ జోరు కనిపించడం లేదు. అనుష్క పెరిగిన బరువు తగ్గించుకునే పనిలో ఉందని కొందరు, కాదు..వైవాహిక జీవితంలో అడుగుపెట్టె ఆలోచనలో ఉందని  మరికొందరు అంటున్నారు.
అసలు విషయం మాత్రం సరైనా కధలు సెట్ కాకపోవడమేనని విస్వశనీయ వర్గాల సమాచారం. భాగమతి తర్వాత చాలా కధలు విన్నది అనుష్క. కాని ఏదీ నచ్చడం లేదు. ఈ మధ్య ఆమె తమిళ రిమేక్ లో నటిస్తుందని వార్తలొచ్చినా అందులో కూడా వాస్తవం లేదట. ఐతే గౌతమ్ మీనన్ తెరకెక్కించే ఓ మల్టీస్టారర్ కు సైన్ చేసింది అనుష్క. ఇదీ చాలా రోజులు క్రితమే. ఇందులో అనుష్క పదిమంది స్టార్స్ లో ఒకరు. జేజమ్మ నట విశ్వరూపం చూపించే సినిమాలు రావాలి. మరి అలాంటి సినిమా ప్రకటన ఎప్పుడు వస్తుందో..