‘గోపీచంద్’కు ఆక్సిజన్ అందేదెప్పుడో.?

92

ఏఎంరత్నం గోపీచంద్ తో తీసిన “ఆక్సిజన్” వాయిదాలపై వాయిదాలు పడుతూ విడుదలకి నోచుకోవడం లేదు. ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ జరిగి, అక్టోబర్ లో ఖచ్చితంగా విడుదల అయి తీరుతుందనుకున్నారు. కానీ నవంబర్ కి వాయిదా పడింది. నవంబర్ 10 అనుకుంటే 15 వచ్చేసింది. తర్వాత నవంబర్17 అన్నారు కానీ అప్పటికి కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు.

17 ఏళ్ళ వయసులో ‘నట్పుకాగ’ (తెలుగులో చిరంజీవి స్నేహం కోసం ) సినిమాకి కథ అందించిన జ్యోతి కృష్ణ ఆ తర్వాత తరుణ్ ‘నీ మనసు నాకు తెలుసు’ అనే సినిమాతో వచ్చాడు.  అయితే అది ఫ్లాప్ అయి ఆయన కెరీర్ కష్టాల్లో పడింది. ఇప్పుడు ఆక్సిజన్ సినిమా కూడా దాదాపు 2ఏళ్ళ కిందే మొదలయినా దర్శకుడికి హీరోకి మధ్య వచ్చిన గొడవల కారణంగానే ఈ సినిమా ఆలస్యమయిందని తెలుస్తోంది.

ఇక సినిమా పూర్తయిన తర్వాత బిజినెస్ సరిగా జరగలేదు. హీరోకి కానీ, దర్శకుడికి కానీ, నిర్మాతకి కానీ హిట్లు లేకపోవడమే సినిమా ఆలస్యం కావటానికి బిజినెస్ జరగకపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు రాశీ ఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ ఆక్సిజన్ సినిమా కి ఆక్సిజన్ ఎప్పుడు అందుతుందో, నిర్మాత ఎప్పుడు హాయిగా గాలిపీల్చుకుంటాడో తెలియడం లేదని సినీ వర్గాలు అంటున్నాయి.