ఈసారైనా ‘భేరి’ కేంద్రానికి వినపడుతుందా.?

104

విపక్ష నేత జగన్ మరోసారి ‘యువభేరి’ మొదలు పెట్టారు. ప్రత్యేక హోదా కోసం జరిపే పోరు వైకాపా  వర్గాలు అభివర్ణిస్తున్నాయి. జగన్ సొంత మీడియాలో ప్రత్యేక హోదాకై  గళమెత్తిన ఏకైక నాయకుడంటూ కథనాలు మొదలయ్యాయి. అయితే ఒక విషయంలో జగన్ నుంచి రాజకీయ వర్గాలు క్లారిటీ కోరుకుంటున్నాయి.

ఆనాడు ప్రత్యేక హోదాపై రాజ్యసభ సాక్షిగా ప్రధాని మన్మోహన్ చేసిన వాగ్దానం చేసారు. ఇందుకై ఆనాడు పోరాడిన భాజపా అధికారంలోకి వచ్చాక హోదా ఇవ్వడానికి మాత్రం సిద్దంగా లేదు. తెదేపాకి భాజపాతో కారణంగా కాళ్ళకు బంధాలు ఉన్నాయి. ఇక హోదా కోసం పోరాడాల్సిన మిగతా పార్టీల్లో వైకాపా ముందు ఉంది. నిజానికి హోదా విషయంలో జగన్ పలు మార్లు సభలు, ఉద్యమాలు పెట్టారు.  కానీ, హోదా ఇవ్వని మోడీని కానీ, వాళ్ళ పార్టీ ని కానీ పల్లెత్తు మాట అనడం లేదు. ఈ కారణంగానే జగన్ ఎన్ని సార్లు ఉద్యమించినా ప్రజల్లో నాటుకోవటం లేదు.

చంద్రబాబు వల్లే హోదా రాలేదని తిడుతూ, అదే వాదన ప్రజల్లోకి ఎక్కించాలని ప్రయత్నం చేయడం వల్ల రావలసిన మైలేజ్ రావడం లేదు. మరి ఈసారైనా హోదాని కాల గర్భంలో కలపడానికి కారణమవుతున్న వారిని డైరెక్టుగా విమర్శిస్తాడా అనేది ఆసక్తికరం. రాజకీయవర్గాలు ఎదురు చూస్తున్న జగన్ ఎంపీల రాజీనామా అంశం కూడా కీలకమే. గతేడాది మాట్లాడుతూ 2017 జూన్ కల్లా ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించాడు. ఇపుడు అక్టోబర్ వచ్చేసింది. మరి ఇప్పుడైనా ఎంపీల తో రాజీనామా చేయించి దేశవ్యాప్త చర్చ జరిగేలా చేస్తారా? లేదో చూడాలి.