‘బిగ్‌బాస్‌’కు నాని వీడ్కోలు చెప్పెసాడా.?

144

నేచురల్‌ స్టార్‌ నాని ‘బిగ్‌బాస్‌–2’ ఫైనల్‌ ఎపిసోడ్‌ ప్రారంభానికి ముందు ట్విట్టర్‌లో ఒక పోస్టు పెట్టాడు. దీని అర్థం ఏంటి? అని ప్రేక్షకుల్లో పలు సందేహాలు మొదలవుతున్నాయి.

ఆ పోస్టు ఏమంటే,  ‘ఈ రోజు (ఆదివారం) ఫినాలే (బిగ్‌బాస్‌–2). హోస్ట్‌గా నాకు చివరి రోజు. నేను నా బెస్ట్‌ ఇచ్చాను. ఇది ఒక అద్భుత ప్రయాణం. ఈ ప్రయాణంలో చాలా నేర్చుకున్నారు. నాకు తెలిసిన చాలా విషయాలను పక్కన పెట్టేసా. షోతో పాటు నా యాంకరింగ్‌ని ఇష్టపడిన వాళ్ళకు థ్యాంక్యూ సోమచ్‌. ఇష్టపడనివాళ్ళకు చెప్పేది ఒక్కటే..థియేటర్లలో కలుద్దాం. బిగ్‌బాస్‌కి ఇంక సెలవు. ఈ రోజు సాయంత్రం చూస్తారుగా..’’ – మీ నాని.

ఈ పోస్టు చూసిన వారంతా మళ్ళీ ‘బిగ్‌బాస్‌’ షో హోస్ట్‌ చేయనని చెప్పినట్టేనా? అని చర్చించుకుంటున్నారు. ‘బిగ్‌బాస్‌’ హోస్ట్‌గా నాని తీరుపై కౌశల్‌ ఆర్మీ సోషల్‌ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేసింది. హోస్ట్‌గా మొదట్లో అంతగా ఆకట్టుకోకున్నా తరవాత తరవాత ఎంతో మెరుగయ్యాడు. అయినా నానిపై విమర్శలు తప్పలేదు. అందువల్ల, అతడు మరోసారి హోస్ట్‌గా చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తొలి సీజన్‌కి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించాడు. సీజన్‌ 2కి నాని వచ్చాడు. కాని చాలామంది ఎన్టీఆర్‌తో నాని పోల్చడం, టీఆర్పీ రేటింగులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేసారు. వాస్తవానికి మొదటి సీజన్‌లో సెలబ్రిటీలకు, రెండో సీజన్‌లో సెలబ్రిటీలకు అసలు సంబంధమే లేదు. మొదటి సీజన్లో అర్చన, ముమైత్‌ఖాన్‌, సంపూర్ణేష్‌బాబు, ప్రిన్స్‌, శివబాలాజీ, ఆదర్శ్‌, హరితేజ, ధనరాజ్‌ వంటి వారుండగా రెండో సీజన్‌కి వచ్చేసరికి సెలబ్రిటీలు ఎక్కువమంది లేరు. దానితో అందరి దృష్టి నాని  నాని యాంకరింగ్‌పై పడింది. మొత్తానికి ఈ రోజుతో ‘రెండవ ఘట్టం’ ముగుస్తుంది. మూడో సీజన్‌కి ఎవరు హోస్ట్‌గా వస్తారో.. చూడాలి.