హతవిధీ.. వచ్చే యాభై ఏళ్ళు కూడా వారేనా.!

123

కేంద్రంలో వచ్చే యాభై ఏళ్ళు భాజపాదే అధికారం అని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేస్తున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన రాబోయే 50 ఏళ్ళా వరకు భాజపాని ఎవరు ఓడించలేరని తేల్చి చెప్పారు.

వాస్తవానికి అరవై ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేనంత అధికార వ్యతిరేకతను భాజపా నాలుగంటే నాలుగేళ్ళలో ఎదుర్కొంటోంది. పాలనా పరమైన వైఫల్యాలతో ప్రజలతో కాంగ్రెస్సే బెటర్ అనిపించుకునేలా చేశారు. అట్టడుగు స్థాయి నుంచి ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలను దిగజార్చే నిర్ణయాలను అడ్డగోలుగా అమలు చేసారు. నోట్ల రద్దు నుంచి జీఎస్టీ వరకూ అలా అమలు చేసేసారంతే.

వచ్చే లోక్‌సభ ఎన్నికలను తన నేతృత్వంలోనే ఎదుర్కోవాలని నిర్ణయించినందున అమిత్ షా ఇంకా ఎనిమిది నెలలే అని రోజులు లెక్క పెట్టుకుటున్న ప్రజలకు యాభై ఏళ్ళ కొత్త లెక్క చెప్పారు. వచ్చే ఎన్నికల్లో భాజపా నినాదం ‘అజేయ భారత్‌-అటల్‌ భాజపా’ అని ప్రధానమంత్రి మోడీ అదే వేదిక నుంచి ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఇప్పటి వరకూ ఏర్పడని మహాకూటమిపై మోడీ, అమిత్ షా ఇద్దరూ విమర్శలు చేసారు.

ఒకరి పక్కన ఒకరు నిలబడని పార్టీల నాయకులు ఇప్పుడు చేతులు కలుపుతున్నారని విమర్శించారు. అసలైతే విపక్షాలన్నీ ఏకమయ్యే పరిస్థితిని తెచ్చింది భాజపానే. ఒకరి పొడ ఒకరికి గిట్టని పార్టీలన్నీ ఇప్పుడు చేతులు కలుపుతూ మహాకూటమికి అంకురార్పణ చేస్తున్నాయి. యాభై ఏళ్ళ అధికారం సంగతేమోకానీ 2019లో భాజపా గట్టెక్కడం కష్టమని అనుకుంటున్న నేపధ్యంలో ప్రజలు ఏం చేస్తారో చూడాలి.