ముఖ్యమైన ‘ఘట్టం’ పూర్తయితే ‘నాటకం’ అంటున్నారు

121

పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల్లో కీల‌క‌మైన డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పోల‌వ‌రంలో పైలాన్ ఆవిష్క‌రించారు. దీనిపై వైకాపా హ‌ర్షిస్తుంద‌ని ఎవ్వ‌రూ అనుకోరు. ‘ఐదో వీధి నాటకం’ అని వారి పత్రికలో రాసారు.

గ‌తంలో నాలుగుసార్లు శంకుస్థాప‌న‌ల కార్య‌క్ర‌మాల పేరుతో హ‌డావుడి చేసినట్లే ఇది కూడా ఐదో కార్య‌క్ర‌మం మాత్ర‌మే అన్నారు.  జాతికి అంకితం అంటూ మ‌రో కొత్త డ్రామాకి తెర లేపార‌ని రాసారు. ఇంత చేస్తున్నా ‘పోల‌వ‌రంపై క్రెడిట్ మాత్రం కావాలంటున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జ‌రుగుతోంద‌నీ, కేవ‌లం కాంట్రాక్ట‌ర్ల ద‌గ్గ‌ర క‌మిష‌న్ల కోస‌మే ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ల్ని చంద్ర‌బాబు త‌న భుజానికి ఎత్తుకున్నార‌నీ, దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచి వ‌చ్చేసార‌ని వైకాపా నేత‌లు విమ‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను అడ్డుకునే విధంగా కేంద్రానికి లేఖ‌లు, కోర్టుల్లో కేసులు వేస్తున్నా ఇప్పుడు పోల‌వ‌రంపై క్రెడిట్ మాత్రం కావాలంటున్నారు. పోల‌వ‌రం గురించి అన్నీ మాట్లాడిన చంద్ర‌బాబు, ఈ ప్రాజెక్టుకు ఎవ‌రు ప్రారంభోత్స‌వం చేసార‌న్న విష‌యం గురించి మాట్లాడ‌లేదు. శంకుస్థాప‌న గురించి క‌నీసం ప్ర‌స్థావించ‌ లేదంటూ విశ్లేషించారు. ఎప్పుడో జ‌రిగిన శంకుస్థాప‌న క్రెడిట్  కావాలంటున్నారే కానీ ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌నుల తీరుపై మాత్రం బాధ్య‌తగా మాట్లాడటం లేదు.

పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు ముందుకు సాగుతుంటే హ‌ర్షించకుండా ఎద్దేవా చేస్తున్నారు. నాలుగు సార్లు శంకుస్థాప‌నలు చేసారని మాత్రమే రాసారు గాని ఆ నాలుగు సార్లు ప్రారంభమైన పనుల గురించి మాత్రం రాయలేదు.