Health Tips: శరీరంపై కొవ్వు గడ్డలకు.. ఉత్తరేణి రసంతో చెక్

Health Tips: మనం పూర్వం నుంచి ఉత్తరేణి ఆకులను పలు ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. వినాయక చవితి పండుగలో వినాయకుడికి సమర్పించే ఆకులలో ఉత్తరేణి తప్పకుండా ఉంటుంది. ఉత్తరేణి ఆకులు పలు ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. ఈ మెక్కలు పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ మొక్క ఆకులు, విత్తనాలు, వేర్లతో సహా అన్ని వైద్యంలో ఉపయోగించే లక్షణాలను కలిగి ఉంటాయి. దీని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

శరీరంలో కొవ్వు గడ్డలు ఏర్పడినప్పుడు ఈ ఆకులను మెత్తగా దంచి ఆకులను పేస్ట్ ను కొవ్వు గడ్డలుపై పెట్టి దానిపై ఆకు వేసి బ్యాండేజ్ కట్టేయాలి. ఒక రాత్రంతా ఉంచి మరుసటి రోజు శుభ్రపరుచుకోవాలి. రెండు రోజులు చేయడం వల్ల కొవ్వు గడ్డలు కరిగి పోతాయి. వీటి రసాన్ని అప్లై చేయడం ద్వారా ఎక్కడైనా చర్మ సమస్యలు ఉంటే తగ్గిపోతాయి.

Health Tips: ఉబ్బసం నుంచి విముక్తి
ఉత్తరేణి ఆకు రసంతో శరీరంపై దురద, పొక్కులు, పొట్టు రాలడం వంటి సమస్యలను పోగొట్టుకోవచ్చు. ఉబ్బసం దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను నిప్పులపైన వేసి ఆ పొగ పీల్చితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఉత్తరేణి ఆకులను కాల్చి బూడిద చేసి దానిని ఆముదముతో కలిపి గజ్జి, తామర ఉన్నచోట లేపనంగా చేయడం వల్ల అవి క్రమంగా తగ్గి పోతాయి.

కందిరీగలు, తేనెటీగలు, తేళ్లు కుట్టినప్పుడు ఆ ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద తగ్గుతాయి. ఉప్పుతో పాటు పటిక పొడి మిశ్రమం, అలాగే వంట కర్పూరం మిశ్రమాన్ని బాగా కలిపి ముద్దగా నూరాలి. పేస్టులా తయారుచేసుకోవాలి. ఆపై పంటినొప్పి ఉన్న చోట దాన్ని రాసుకోవాలి. చిగుళ్లలో నుంచి రక్తం కారడం వంటి సమస్య ఉన్నవారు తొందరగా ఉపశమనం పొందవచ్చు. చిగళ్లలో ఏర్పడిన రక్తస్రావాన్ని కూడా నివారించుకోవచ్చు.

ఉత్తరేణి ఔషధాన్ని వాడటం ద్వారా తొందరగా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. చర్మంపై అయ్యే గాయాలను నివారించడంలోనూ దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించడంలోనూ ఉత్తరేణి అద్భుతంగా పనిచేస్తుంది.

Similar Articles

Comments

తాజా వార్తల