Sania Mirza Divorce: షోయబ్‌ మాలిక్‌తో విభేదాలు.. సానియా మీర్జా విడాకులు!

Sania Mirza Divorce: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆమె క్రీడల్లో రాణిస్తున్న సమయంలోనే 2010లో పాకిస్థాన్‌కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుని విమర్శల పాలైంది. ఎన్ని విమర్శలు వచ్చినా తాను షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకోవడాన్ని సానియా సమర్ధించుకుంది. ఇది ఆమె పర్సనల్ విషయం కాబట్టి చాలా మంది చూసీ చూడనట్లు వ్యవహరించారు. కానీ భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లు జరిగినప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక సానియా ఉక్కిరి బిక్కిరి అయ్యేది.

షోయబ్ మాలిక్-సానియా దంపతులకు 2018లో ఇజాన్ మీర్జా మాలిక్ పుట్టాడు. ఇటీవల ఇజాన్ పుట్టినరోజు వేడుకలను దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మాలిక్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే సానియా మీర్జా ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు. దీంతో వీళ్లద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా వీళ్ల విడాకులు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అటు సానియా మీర్జా ఇటీవల ట్విటర్ వేదికగా కొడుకు ఇజాన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీనికి తాను కష్టతరమైన సమయాల్లో తీసుకున్న క్షణాలు అంటూ క్యాప్షన్‌గా పేర్కొంది. అంతకుముందు పోస్ట్‌లో విరిగిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి..? అంటూ ఏదో బాధలో ఉన్నట్లు పేర్కొంది. దాంతో సానియా సంసారంలో ఏదో జరుగుతుందని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం షోయబ్, సానియా వేర్వేరుగా ఉంటున్నారని.. వీడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు.

సానియా, షోయబ్ స్పందిస్తారా?

సోషల్ మీడియాలో తమ సంసారం గురించి పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్నా సానియా మీర్జా, షోయబ్ మాలిక్ స్పందించకపోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప ఈ రూమర్లకు చెక్ పడేలా కనిపించడం లేదు. సానియా మీర్జా ఆటపరంగా భారత్‌కు ఎన్నో మెడల్స్ అందించింది. టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 100కి చేరుకున్న క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఆమె ఖాతాలో ఆరు డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి.

Similar Articles

Comments

తాజా వార్తల