Nara Brahmani: బ్రాహ్మణి బైక్ రైడింగ్ వీడియో వైరల్.. ఆమె టాలెంట్‌కు షాకవుతున్న నెటిజన్స్!

Nara Brahmani: నందమూరి నటసింహం బాలకృష్ణ కుమార్తెగా నారా బ్రాహ్మణికి ఎంతో మంచి గుర్తింపు ఉంది. నారావారి ఇంటి కోడలుగా కూడా ఆమె పాపులారిటీ ఎంతగానో పెరిగింది. ఒకవైపు బాలకృష్ణ కూతురిగా, మరోవైపు చంద్రబాబు కోడలిగా క్రేజ్ ఉన్నప్పటికీ.. తనకంటూ పేరు, ప్రఖ్యాతులు సంపాదించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.

‘హెరిటేజ్’ సంస్థను ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నారు బ్రాహ్మణి. ఈ ప్రముఖ పాల సంస్థ వ్యాపార బాధ్యతలను ఆమె తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఆమె తెలివితేటలు, వ్యాపార దక్షత, ముందుచూపుతో ‘హెరిటేజ్’ సంస్థ దూసుకుపోతోంది.

రైడింగ్ అంటే పిచ్చి..!
వ్యాపారిగానే కాక పలుసేవ కార్యక్రమాలను కూడా బ్రాహ్మణి నిర్వహిస్తున్నారు. ఆమెలో మరో కోణం కూడా దాగి ఉందని తాజాగా బయటపడింది. బ్రాహ్మణికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టమట. ప్రొఫెషనల్ బైక్ రైడింగ్ గ్రూప్ లో కూడా ఆమె సభ్యురాలిగానూ కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె లడఖ్ హిల్ స్టేషన్ ఏరియాలో బైక్ రైడింగ్ చేస్తున్నటు వంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

జావా యజ్దీ స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ లడక్ లాంటి ప్రాంతాల్లో తాను రైడింగ్ చేసిన ఫొటోలు వీడియోలను బ్రాహ్మణి షేర్ చేశారు. ఈ రైడింగ్ విశేషాలను, అనుభూతులను కూడా ఆమె అందరితో పంచుకున్నారు. వీటిని చూసినటువంటి ఎంతోమంది అభిమానులు బ్రాహ్మణిలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Similar Articles

Comments

తాజా వార్తల