PM Modi: టార్గెట్ 150.. అస్సలు తగ్గేదేలే అంటున్న మోడీ..!

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ కేవలం ఓ నాయకుడు మాత్రమే కాదు.. ఆయన రాజకీయ పండితుడు కూడా. అందుకే చాయ్ వాలా నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగారు. తన చాణక్యతతో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ.. అతి తక్కువ సమయంలో పార్టీలో పట్టు తెచ్చుకుని, ప్రధాని అభ్యర్థి కాగలిగారు. ఆ తర్వాత దేశమంతా తాను సక్సెస్ సాధించిన గుజరాత్ మోడల్ ను బాగా ప్రచారం చేసి బీజేపీని వరుసగా రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు.

పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్న మోడీ
గుజరాత్ మోడల్ తో ఇండియా వ్యాప్తంగా సక్సెస్ సాధించిన మోడీ.. ఇప్పుడు అదే రాష్ట్రంలో బీజేపీని మరోమారు పవర్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తానే అంతా అయ్యి.. పార్టీని ఫుల్ మెజారిటీతో అధికారంలోకి తెచ్చేందుకు మోడీ అన్ని శక్తులను కూడగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మోడీ తాజాగా ఓ నినాదం ఇచ్చారు. ‘టార్గెట్ 150’ అనే లక్ష్యంతో మోడీ బీజేపీ నేతలను, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.

అన్నీ తానై నడిపిస్తూ..
గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని మోడీ అన్నీ తానై బీజేపీని నడిపిస్తున్నారు. ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నా దాన్ని ఆయన కనబడనీయట్లేదు. ‘నన్ను చూసి ఓటేయండి’ అంటూ ఓటర్లకు పిలుపునిస్తున్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీలను తరిమి కొట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన చెబుతున్నారు. ఆ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడగొట్టాలని మోడీ అంటున్నారు. ఎన్నికల్లో బీజేపీని ఢీకొంటే ఎలా ఉంటుందో రుచి చూపించాలని చెబుతున్నారు.

మ్యాజిక్ చేస్తారా?
ఈసారి గుజరాత్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని మోడీ అండ్ కో ప్లాన్ చేస్తున్నారు. 1985లో మాధవ్సిన్స్ సోలంకీ కాంగ్రెస్ ను గెలిపించిన విధంగానే బీజేపీకి అపూర్వమైన విక్టరీని అందివ్వాలని మోడీ భావిస్తున్నారు. 1985లో గుజరాత్ లో జరిగిన ఎన్నికల్లో సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 149 సీట్లు గెలుచుకుంది. ఈ రికార్డుపై మోడీ కన్నేశారు. తన హవా బాగా నడుస్తున్న ఈ కాలంలో ఎలాగైనా 150 సీట్లలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ కార్యవర్గానికి మోడీ దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. మరి, మోడీ తాను అనుకున్న మ్యాజిక్ చేసి చూపిస్తారో లేదో కాలమే సమాధానం చెబుతుంది.

Similar Articles

Comments

తాజా వార్తల