TS Minister Mallareddy: మల్లారెడ్డి.. అది ఇళ్లా లేక బ్యాంకు ట్రెజరీనా?

TS Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి తెలంగాణలో మంత్రి పదవితో పాటు, వివిధ వ్యాపారాలు, విద్యా సంస్థలు నడిపిస్తున్నారు. ఇక వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ కార్యక్రమంలో అయినా తనదైన శైలిలో స్పందిస్తారు. ఇక తాజాగా ఐటీ దాడులతో మంత్రి సంపాదన ఆదాయాలు మొత్తంగా బయటపడ్డాయి. ఇక విచారణలో విస్తు పోయే నిజాలు బయట పడ్డాయని అధికారులు అంటున్నారు. ఇంత ఆస్తి ఎలా కూడబెట్టారంటూ నోటిఫై వేలు వేసుకుంటున్నారు.

TS Minister Mallareddy: ఆ బ్యాంకుపై అధికారుల దృష్టి?
వివిధ మార్గాల ద్వారా మంత్రి కూడబెట్టిన ఆస్తి అంతా ఇంతా కాదు. ఈ విషయాన్ని ఇండైరెక్టుగా చాలా సార్లు మల్లారెడ్డి ప్రకటించారు. ఈ విషయం తాజా ఐటీ దాడులతో తేట తెల్లం ఐంది. నిజంగానే మంత్రి మల్లారెడ్డి మామూలోడు కాదని ఆశ్చర్యపోతున్నారు అధికారులు. అయితే తన లావాదేవీలు మొత్తం సులభంగా డీల్ చేయడానికి ఒక బ్యాంకునే ప్రత్యేకంగా వాడుకుంటున్నట్టు గుర్తించారు అధికారులు. ప్రస్తుతం ఆ బ్యాంకుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఇక మల్లారెడ్డి ఇంట్లో మరియు తన అనుచరులు, బంధుగణాల్లో అనుమానితుల ఇళ్లపై కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. దాడుల్లో భాగంగా కీలక అంశాలు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. ఒక ప్రత్యేకమైన బ్యాంకు ద్వారా ఈ లావాదేలు జరగడం గుర్తించిన అధికారులు పూర్తి విషయాలు కూపీ లాగుతున్నారు. ఈ దాడుల్లో మల్లారెడ్డి సొంత వ్యాపారాలకు సంబంధించి విలువైన సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారని తెలుస్తోంది.

తాజా దాడులు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ దాడితో మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటి నుండే జాగ్రత్తలు ప్రారంభించారని సమాచారం. ఇక అధికార పార్టీ నేతలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారట పార్టీ పెద్దలు. చూద్దాం తరవాత రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో?

Similar Articles

Comments

తాజా వార్తల