Life Style: భార్య భ‌ర్త‌ల మ‌ధ్య ఎంత దూరం ఉంటే మంచిది!

Life Style: పెళ్ళి అనేది అందరి జీవితంలోకి ఒక మధుర జ్ఞాపకం. ఏ విధంగా పెళ్ళి చేసుకోవాలో కూడా ముందుగా ప్రణాళిక వేసుకుంటున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు పెళ్ళి మీద ఎలాంటి ఆశలు పెట్టుకుంటారో. ఇక ఇండియా లాంటి దేశాల్లో అయితే పెళ్ళి వేడుకల గురించి చెప్పే పనే లేదు. కొంత మంది ఐదు రోజుల పెళ్ళి కూడా చేసుకుంటారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ తమ జీవితంలోకి వచ్చే భాగస్వామి తమతో ఎలా ఉండాలో కొన్ని అంచనాలను పెట్టుకుంటారు.

భార్యా భర్తల మధ్య ఉండే అనుబంధం ఎలా ఉండాలంటే..

పెళ్ళి చేసుకునే యువత తమ భాగస్వామి గురించి ఎన్నో కలలు కంటారు. అయితే చాలా మంది తమ అంచనాలను అందుకోలేరు. పెళ్ళి చేసుకున్న తరువాత అసలు సమస్యలు మొదలవుతాయి. దంపతులు చాలా విషయాల్లో ఒకరితో ఒకరు ఇబ్బంది పడతారు. దంపతులు వాళ్ళ భాగస్వామిని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తాయట.

దంపతులు ఒకరితో ఒకరు ఎలా ఉండాలో చెప్తున్నారు నిపుణులు. భార్యా భర్త ఒకరి మీద ఒకరు పెత్తనం చూపించడానికన్నా ప్రేమ చూపించడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా బంధం నిలబడాలంటే గౌరవం ముఖ్యం. దంపతులు ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. బంధం బలపడాలంటే ఎలాంటి దూరం దరి చేరకూడనివ్వదు. ఇలా అవ్వాలంటే భాగస్వామికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పడం మరిచిపోకూడదు.

నేను అనే భావన వదిలి మనము అనే సిద్ధాంతాన్ని నమ్ముకోవాలి. ఏదైనా సమస్య వస్తే అది ఇద్దరికీ వర్తిస్తుంది అని గుర్తించుకుని సమస్యలని ఎదురుకోవాలి. దంపతుల మధ్య మ‌న‌స్ప‌ర్ద‌లకు అసలు తావే ఉండకూడదు. ఒక్కసారి మ‌న‌స్ప‌ర్ద‌లు అనేవి వస్తే బంధం తెగేదాకా వెళ్ళే అవకాశం లేకపోలేదు. చిన్న చిన్న విషయాలకే భార్యా భర్త విడిపోయిన సంఘటనలు మనం విన్నాం. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తమ మధ్యన ఉన్న దూరాన్ని అంతమున చేయాలి దంపతులు. నిపుణులు చెప్పేది ఏంటంటే పెళ్ళి బంధంలో భార్యా భర్త ఇద్దరూ ముఖ్యమే. కాబట్టి నేనే గొప్ప అనే వాదన మానెయ్యాలి.

Similar Articles

Comments

తాజా వార్తల