Facebook and Twitter: ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ సంక్షోభంలో ఉన్నాయా? వాటి కథ ముగిసినట్లేనా?

Facebook and Twitter: సోషల్‌ మీడియా సామ్రాజ్యంలో దూసుకెళ్తున్న ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లు సంక్షోభంలో కూరుకుపోతున్నాయా? వాటి కథ ఇక ముగిసినట్లేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంల పరిస్థితి దయనీయంగా మారుతోందని చెబుతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని చెబుతున్నారు. దానికి కారణం.. ఉద్యోగులను ఉన్నఫలంగా తొలగిస్తుండడమేనని స్పష్టం చేస్తున్నారు.

సోషల్‌ మీడియా సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ గతంలో మాదిరిగా సేవలు అందిస్తాయా? అనేది కూడా ప్రశ్నార్థకమవుతోంది. నిపుణులు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ఏడాదిగా దిగ్గజ టెక్ సంస్థలైన యాపిల్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ఆల్ఫాబెట్‌లకు చెందిన మూడు ట్రిలియన్ డాలర్లు దాదాపు 244 లక్షల కోట్ల వరకు సంపద మార్కెట్ నుంచి ఆవిరైంది.

ఈ నెలలో అమెజాన్‌తోపాటు చాలా సంస్థలు ఉద్యోగులను ఇంటికి పంపేందుకు శ్రీకారం చుట్టాయి. భారీగా కోతలు విధిస్తూ ఉద్యోగులను రోడ్లపై పడేస్తున్నాయి.మొత్తంగా 1,36,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం అందుతోంది. ఈ జాబితాలో ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. ఈ సంస్థ ఇప్పటివరకు 11 వేల మందిని తొలగించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు ట్విట్టర్ కూడా తమ ఉద్యోగుల్లో సగం మందిని అంటే 3,700 మందికి ఉద్వాసన పలికింది.

Facebook and Twitter: నిర్వహణపై నీలినీడలు..!
ఈ క్రమంలో వాటి నిర్వహణపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సంక్షోభాలను తట్టుకొని ఈ సంస్థలు నిలబడగలవా? అనే ప్రశ్నలు ఉత్పన్నవమతున్నాయి. ప్రస్తుతం ఇవి ప్రపంచ ఆర్థిక మందగమన ప్రభావాన్ని చవిచూస్తున్నాయి. అంటే వ్యాపార లావాదేవీల్లోకి వచ్చే డబ్బు పూర్తిగా తగ్గిపోతోందని స్పష్టమవుతోంది. ప్రకటనల ఆదాయం కోల్పోతే ఇక నిర్వహణ కష్టమవుతుంది. ఆర్థిక మందగమనం కారణంగా ఆదాయం భారీగా పడిపోయింది. అక్టోబర్ చివర్లో మెటా విడుదల చేసిన ఆర్థిక నివేదికలో సంచలన అంశాలు వెలుగు చూశాయి. కంపెనీ రెవెన్యూ భారీగా పడిపోయింది.

Similar Articles

Comments

తాజా వార్తల