Falaknuma Palace: ఫలక్‌నుమా ప్యాలెస్ నిర్మాణానికి అన్ని కోట్లా?.. కట్టిన వ్యక్తి అప్పుల పాలయ్యాడా?

Falaknuma Palace: తెలంగాణలో టూరిజం సిటీగా రాజధాని హైదరాబాద్ నే చెప్పుకోవాలి. చార్మినార్, గోల్కొండ ఖిల్లా, బిర్లా మందిర్, జూపార్క్ లాంటి ఎన్నో సందర్శన ప్రదేశాలు భాగ్యనగరంలో ఉన్నాయి. అయితే వీటితోపాటు ఫలక్ నుమా ప్యాలెస్ కూడా ఎంతో ఫేమస్ అనే చెప్పాలి. 32 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్.. చార్మినార్ కు సుమారు 5 కిలో మీటర్ల దూరంలో ఉంది.

ఫలక్ నుమా ప్యాలెస్ తేలు ఆకారంలో నిర్మించబడింది. దీన్ని ఇటాలియన్ నిర్మాణ శైలిలో టుడూర్ ఆర్కిటెక్చర్ తో కట్టారు. ఉర్దూలోని ఫలక్ నుమా అనగా తెలుగులో ఆకాశ దర్పణం అని అర్థం. ఈ ప్యాలెస్ తేలు ఆకృతిలో ఉంటూ 60 గదులు, 22 విశాలమైన హాళ్లు ఉంటాయి. అక్కడ ఓ డైనింగ్ హాల్లో ఏకంగా వంద మంది భోజనం చేసే వీలుంది.

అప్పట్లోనే అంత ఖర్చా..?
ఫలక్ నుమా ప్యాలెస్ ‘పైగా’ వంశస్థుల కట్టడం. మన దేశంలో ముస్లిం రాజుల పరిపాలన టైమ్ లో ఎన్నో కట్టడాలు నిర్మితమయ్యాయి. అయితే నిజాం ప్రభువుల కాలంలో ఈ ప్యాలెస్ ను కట్టారు. దీని నిర్మాణానికి అప్పట్లోనే దాదాపుగా రూ.40 లక్షలు ఖర్చయినట్లుగా చెబుతారు. దీన్ని కట్టించిన వ్యక్తి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారట. అయితే ఇప్పుడు అదే ప్యాలెస్ లోని ఒక అద్దం ఖరీదు సుమారు రూ.35 కోట్లని తెలుస్తోంది.

పైగాల నుంచి నిజాంల చేతుల్లోకి ప్యాలెస్..
ఫలక్ నుమా ప్యాలెస్ ను హైదరాబాద్ ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ బావ అయిన నవాబ్ వికారుల్ ఉమ్రా కట్టించారు. ఈ భవనాన్ని 300 ఎకరాల్లో నిర్మించారు. అయితే దీని నిర్మాణం వల్ల వికారుల్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీన్ని కట్టడం వల్ల అయిన అప్పులను తీర్చడానికి ఆయనకు చాలా కాలం పట్టిందట. ఇక 1895లో నిర్మాణం ఖర్చులు చెల్లించి నిజాం ప్రధాని మహబూబ్ అలీ పాషా కొనుగోలు చేశారు. అలా పైగా వంశస్తుల నుంచి నిజాంల చేతుల్లోకి ఈ భవనం వెళ్లిపోయింది.

Similar Articles

Comments

తాజా వార్తల