Lady Cheating: ఆంటీతో ముసలాయనతో సరసాలు.. ఆంటీ ఏం చేసిందో తెలిస్తే షాకే!

Lady Cheating: ఈరోజుల్లో చాలామంది తొంద‌ర‌గా డ‌బ్బు సంపాదించాల‌ని అడ్డ‌దారులు తొక్కుతున్నారు. దీనికోసం ఎలాంటి ప‌నిచేయ‌డానికైనా వెన‌కాడ‌డం లేదు. ఇలాంటి ఘ‌ట‌నే తాజాగా కేర‌ళ‌లో చోటు చేసుకుంది. తొంద‌ర‌గా కోటీశ్వ‌రులు అయిపోవాల‌ని ఆశ‌తో ఓ జంట ఓ ముస‌లాయ‌న‌కు వ‌ల విసిరి మోసం చేశారు. త‌ర్వాత ప‌థ‌కం ప్ర‌కారం డ‌బ్బు కోసం అత‌నిని వేధించారు. ఇప్పుడు ఈ సంఘట‌న తెలుసుకున్న వారంతా డ‌బ్బు కోసం ఇంతటి ఘాట‌కానికి పాల్ప‌డ‌తారా అని విస్తుపోతున్నారు.

విష‌యం ఏంటంటే..
కేరళ లోని మలప్పురానికి చెందిన రశీదా ఆమె భర్త నిషాద్‌తో క‌ల‌సి ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అన‌తికాలంలోనే పాపులారిటీ సంపాదించుకున్నారు. వీళ్ల వీడియోల‌కు చాలా మంది అభిమానులు ఉండేవారు. అలా వీళ్లు సోష‌ల్‌మీడియాలో స్టార్స్‌గా మారారు. అయితే డ‌బ్బు మీద ఆశ ఎక్కువైన ఈ జంట త్వ‌రగా కోటీశ్వ‌రులు కావాల‌నే దురుద్ధేశంతో ఓ భారీ స్కెచ్ వేశారు. దీనికోసం ర‌శీదా ఫేస్‌బుక్ లో ఓ డ‌బ్బున్న ముస‌లాయ‌న‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి అత‌ను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయ‌గానే అత‌డికి మాయ‌మాట‌లు చెప్పి ప‌రిచ‌యం ఏర్ప‌ర‌చుకుంది.

ఇలా వీరు మ‌ధ్య చాటింగ్ కొన‌సాగుతుండ‌గా ఒక‌రోజు మిమ్మ‌ల్ని క‌ల‌వాలి అంటూ అత‌డికి మెసేజ్ చేసింది. దీంతో ఆ ముస‌లాయ‌న ఆమె ఇంటికి వెళ్ల‌గా అక్క‌డ ఆమె భ‌ర్త కూడా ఉండ‌డంతో ముస‌లాయ‌న ఒక్క‌సారిగా కంగుతిన్నాడు. అయితే త‌న భ‌ర్త‌కు ఈ విష‌యం మొత్తం తెలిస‌ని ఆయ‌న్ను న‌మ్మ‌బ‌లికి ఆయ‌న్ను బుట్ట‌లో వేసింది.

ఇదంతా నిజ‌మ‌ని న‌మ్మిన ఆ ముస‌లాయ‌న ఆమెతో స‌ఖ్యంగా మెలిగాడు. అయితే వీరిద్ద‌రూ స‌ర‌సాలాడుకున్న దృశ్యాల‌ను ర‌షీదా భ‌ర్త సీక్రెట్‌గా వీడియో తీసాడు. త‌రువాత ఆ వీడియోలు చూపించి ఆ ముస‌లాయ‌న‌ను డ‌బ్బులు ఇవ్వ‌మ‌ని బెదిరించాడు. దీంతో ఏం చెయ్యాలో తెలియ‌ని ముస‌లాయ‌న అక్క‌డి నుండి ఎలాగోలా త‌ప్పించుకొని జ‌రిగిన విష‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌కు చెప్పి బాధ‌ప‌డ్డాడు. వెంట‌నే వాళ్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ర‌షీదా ఆమె భ‌ర్త‌ను పోలీసులు అరెస్టు చేసి విచార‌ణ చేయ‌గా ఈ మొత్తం ఉదాంతం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్పుడు ఈ విష‌యం తెలిసిన వారు డ‌బ్బు కోసం ఇలా దిగ‌జారుతారా అని ఈ జంట‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.

Similar Articles

Comments

తాజా వార్తల