Teacher Jobs: కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..

Teacher Jobs: మీకు ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని ఉందా? అందుకు తగిన అర్హతలున్నాయా? జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ పోస్టులు పడ్డాయి. త్వరగా దరఖాస్తు చేసుకోండి మరి.. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనం పూర్తిగా చదవండి.. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించాయి. ఏపీలో అయితే చాలా కాలం తర్వాత టెట్ పరీక్ష నిర్వహణ జరిగింది.  

teacher jobs

ఏపీలో సుమారు 5.5 లక్షల మంది టెట్ పరీక్ష రాశారు. డీఎస్సీ విషయానికి వస్తే అక్కడి విద్యా శాఖ మంత్రి బొత్స దీనిపై కొన్నాళ్ల కిందట స్పందించారు. డీఎస్సీ కూడా అవసరాన్ని బట్టి నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక తెలంగాణలోనూ డీఎస్సీ నోటిఫికేషన్ ఇదిగో అదిగో అంటూ ప్రభుత్వం చెబుతోంది. విద్యా శాఖ మంత్రి కూడా దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే, పూర్తి స్థాయి డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తారనేది రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా స్పష్టం చేయడం లేదు. 

ఇక కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ పోస్టుల విషయానికి వస్తే.. వీటి భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో మొత్తం 4,014 టీచింగ్​, నాన్​ టీచింగ్​ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటిలో ప్రిన్సిపల్​, వైస్​ ప్రిన్సిపల్​, టీజీటీ, పీజీటీతో పాటు సెక్షన్​ ఆఫీసర్​ పోస్టులు కూడా ఉన్నాయని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఎవరు అర్హులంటే.. 

కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే తగిన అర్హతలుండాలి. బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులు. టీచింగ్​ పోస్టులకు తప్పనిసరిగా సీటెట్​ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు ఈ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్​ 16వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలు https://kvsangathan.nic.in/ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు.

Similar Articles

Comments

తాజా వార్తల