Teja: ఉదయ్ కిరణ్ నా కాళ్లు పట్టుకుంటానన్నాడు.. డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు..

Teja: టాలీవుడ్ లో విజయవంతమైన డైరెక్టర్ గా తేజ రాణించాడు. ఒకప్పుడు మంచి సినిమాలు తీసి మంచి పేరు సంపాదించుకున్నాడు. తన సినిమాలతో చాలా మందిని హీరోలుగా చేశాడు. యువ హీరోలకు బెస్ట్ కెరీర్ అందించాడు కూడా. అలాంటి హీరోల్లో దివంగత ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. తేజ దర్శకత్వం వహించిన చిత్రం మూవీలో ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించాడు. ఆ మూవీతో డైరెక్టర్ కు, హీరోకు మంచి పేరొచ్చింది.

అయితే, మొదట ఈ చిత్రానికి హీరోగా మరో కథానాయకుడిని అనుకున్నారట. కానీ చివరకు ఉదయ్ కిరణ్ కన్ఫం అయ్యాడట. అనంతరం తేజ, ఉదయ్ కిరణ్ కాంబోలో నువ్వు నేను అనే మూవీ వచ్చింది. ఆ తర్వాతే హీరోగా ఉదయ్ కిరణ్ ఫామ్ లోకి వచ్చాడు. వరుస ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. అనతి కాలంలోనే యువ హీరోగా, పాపులర్ అయ్యాడు ఉదయ్ కిరణ్.

మరోవైపు కొన్ని హిట్లు సాధించాక డిజాస్టర్ మూవీలు కూడా మొదలయ్యాయి ఉదయ్ కిరణ్ కు. అనంతరం నిర్మాతలు ఉదయ్ కిరణ్ తో సినిమా చేయాలంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉదయ్ కిరణ్ నటించిన ఔనన్నా కాదన్నా మూవీ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి డైరెక్టర్ తేజ ఇటీవల వెల్లడించారు.

ఔనన్నా కాదన్నా మూవీ చేస్తున్న సమయంలో..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ మాట్లాడుతూ, తన దర్శకత్వంలో వచ్చిన చిత్రం, నువ్వు నేను సినిమాల ద్వారా ఉదయ్ కిరణ్ కు స్టార్ డమ్ పెరిగిందన్నాడు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కు చాలా సార్లు మాట్లాడాలని ప్రయత్నించినా తను రెస్పాండ్ కాలేదన్నాడు. ఔనన్నా కాదన్న మూవీ చేస్తున్న సమయంలో ఓ రోజు ఉదయ్ కిరణ్ తన వద్దకు వచ్చి తప్పు చేశాను… మీరు పిలిచినా రెస్పాండ్ కాలేదు.. అంటూ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ప్రయత్నించాడని తేజ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తేజ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Similar Articles

Comments

తాజా వార్తల