Hansika Honeymoon: హన్సిక వెరీ నాటీ.. హనీమూన్‌ ప్లాన్‌ అలా చేస్తోందా?

Hansika Honeymoon: హీరోయిన్‌గా తనదైన శైలిలో రాణించిన హన్సిక మోత్వానీ ఇటీవలే ఓ ఇంటి కోడలైంది. అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో సెలబ్రిటీలు చాలా మంది పాల్గొని నూతన జంటను అభినందనలతో ముంచెత్తారు. భారీ సెట్టింగులతో వీరి వివాహ వేదిక రిచ్‌గా కనిపించింది. సాధారణంగా హీరోయిన్లు కాస్త లేటు వయసులో పెళ్లాడుతుంటారు. ఏ వ్యాపారవేత్తనో సెటిలైన పర్సన్‌నో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. హన్సిక కూడా ప్రస్తుతం అదే పని చేసిందని అభిమానులు చర్చించుకుంటున్నారు.

పెళ్లి తర్వాత వెంటనే పిల్లల్ని కంటుంటారు చాలా మంది హీరోయిన్లు. అదే బాటలో హన్సిక కూడా పయనిస్తోందట. తాను ఎంతో కాలంగా ప్రేమించిన వ్యక్తిని ఇటీవల పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. పెళ్లి, తర్వాత హనీమూన్‌ గురించి చాలా పకడ్బందీగా ప్లాన్‌ చేసిందని తెలుస్తోంది. ముఖ్యంగా హనీమూన్‌ కోసం కాస్త డిఫరెంట్‌గా ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి తంతు అయ్యాక ఈ విషయాలు రివీల్‌ అయ్యే చాన్స్‌ కనిపిస్తోంది. హన్సిక తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.

దేశముదురు మూవీతో టాప్‌ గేర్‌..
స్టైలిష్‌ స్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌ నటించిన దేశ ముదురు మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. తర్వాత అనేక చిత్రాల్లో హీరోయిన్‌గా రాణించింది. పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన దేశముదురు సినిమా అనేక సంచలనాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హన్సిక నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

తెలుగులో బోర్‌ కొట్టిందో ఏమో.. తర్వాత హీరోయిన్‌ హన్సిక రూటు మార్చింది. కోలీవుడ్‌ ఇండస్ట్రీలోకి వెళ్లి టాప్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలో ఆమె వివాహం, డేటింగ్‌, బాయ్‌ ఫ్రెండ్స్‌ గురించిన అనేక వార్తలు వినిపించాయి. అయితే, వీటిపై ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చిన హన్సిక.. చివరకు తాను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని తేల్చింది. త్వరలో పెళ్లి చేసుకుంటానని, ఈ విషయం ముందే మీకు చెబుతానని మీడియాకు స్పష్టం చేసింది. అకున్నట్లే తన బాయ్‌ ఫ్రెండ్‌ను పెద్దలకు పరిచయం చేసి అందరినీ ఒప్పించి పరిణయమాడింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహెల్‌ను మనువాడింది హన్సిక.

Similar Articles

Comments

తాజా వార్తల