Hero Review: హీరో మూవీ రివ్యూ

Hero Review: అశోక్ గల్లా ప్రధాన పాత్ర పోషించిన హీరో మూవీ తొలి రోజు నుంచే మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. హీరో అశోక్ ప్రిన్స్ మహేశ్ బాబు అల్లుడు కావడంతో ఆడియన్స్ మూవీని చూడటానికి థియేటర్లకు తరలివస్తున్నారు. అశోక్ గల్లా సైడ్ నుంచి మహేశ్ బాబు లాగానే ఉన్నాడని, సినిమాలో ఎంట్రీ, మహేశ్ బాబు టక్కది దొంగను గుర్తు చేసిందని ప్రేక్షకులు అంటున్నారు.

Hero Review

అశోక్ గల్లాకు ఇది టాలీవుడ్ లో ఫస్ట్ మూవీ. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు కథ, స్ర్కీన్ ప్లే అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. వద్మావతి గల్లా ప్రొడ్యూస్ చేయగా, గిబ్రాన్ సంగీతాన్ని, సమీర్ రెడ్డి, రిచార్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. మెయిన్ సపోర్టింగ్ రోల్స్ లో జగపతి బాబు, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య నటించారు.

ఈ సినిమా ఎప్పోడో రిలీజ్ కావలసింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు రిలీజ్ అయింది. మొదటి సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు అశోక్ గల్లా. ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి క్యారెక్టర్లో కనిపిస్తాడో వేచి చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే

హీరోమూవీ స్టోరీ చాలా కొత్తగా ఉంది. రొటీన్ కు భిన్నంగా ఉంది. అశోక్ గల్లా ఎంట్రీలో, టక్కరి దొంగలా కనిపించి తన మామ మహేశ్ బాబుని గుర్తు చేశాడు. యాక్టింగ్, డాన్స్, డైలాగ్ డెలీవరీ అద్భతంగా ఉంది. వెన్నెల కిషోర్ కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా ఈ హీరో.

మూవీ రేటింగ్ : 3.5/5

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

తాజా వార్తల