HIT 2 Collections: ‘హిట్ 2’ బ్రేక్ ఈవెన్ పూర్తి.. రికార్డు సృష్టించిన అడివి శేష్ మూవీ!

HIT 2 Collections: టాలీవుడ్ నయా స్టార్ గా అవతరించారు అడివి శేష్. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ స్టార్ హీరోల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారీ యువ కథానాయకుడు. ‘క్షణం’, ‘ఎవరు’, ‘గూఢచారి’, ‘మేజర్’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను ఆయన అందుకున్నారు. ఇప్పుడు ‘హిట్ 2’ విజయంతో స్టార్ హీరోల కేటగిరీలో శేష్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారని సినీ విశ్లేషకులు అంటున్నారు.

అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘హిట్ 2’ చిత్రం గత శుక్రవారం ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ‘మేజర్’ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న శేష్ లో.. ‘హిట్ 2’ విజయం మరింత ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి.

లాభాలు పంచుకుంటున్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లు
‘హిట్ 2’ వసూళ్ల పరంగా చూసుకుంటే శేష్ గత సినిమాలను మించిపోతోంది. రూ.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో థియేట్రికల్ రన్ ను మొదలుపెట్టిన ‘హిట్ 2’.. ఆ టార్గెట్ ను కేవలం మూడ్రోజుల్లోనే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఆదివారం సాయంత్రానికే లక్ష్యాన్ని చేరుకుందని తెలిసింది. మొత్తంగా ఈ సినిమాకు నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.21 కోట్లు షేర్‌, రూ. 28.70 కోట్లు గ్రాస్ వచ్చిందని తెలుస్తోంది. అంటే చిత్రాన్ని కొనుకున్న బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ లాబాలను పంచుకుంటున్నారని తెలుస్తోంది.

ఇక, ‘హిట్ 2’ థియేటర్లలో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తుండటంతో మూవీ టీమ్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అడివి శేష్ ఆసక్తికమైన విషయాలు మాట్లాడారు. ‘ఈ చిత్రం ఎలాంటి టాక్‌ను తీసుకొస్తుందా అని నేను చాలా టెన్షన్ పడ్డా. ఉదయాన్నే నిద్రలేవగానే మహేష్ బాబు నుంచి మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. దీంతో వెంటనే ఆయనకు కాల్ చేశా’ అని శేష్ చెప్పుకొచ్చారు. తనను చూసి గర్వపడుతున్నట్లు మహేష్ చెప్పారని.. ఆ మాట వినగానే కళ్లలో నీళ్లు ఆగలేదన్నారు.

Similar Articles

Comments

తాజా వార్తల