Kangana Ranauth: అమీర్ ఖాన్ పై కంగన సంచలన వ్యాఖ్యలు.. భారతీయుడిగా సిగ్గు పడాలి అంటూ…

Kangana Ranauth: కంగనా రనౌత్… సినిమాల్లోనే కాదు బయట విషయాల్లోనూ తన దూకుడు ని ఎప్పటికి ప్రదర్శిస్తూనే ఉంటుందని మనకు తెలుసు. తనకు ఏదైనా తప్పుగా అనిపిస్తే మాత్రం అసలు ఊరుకోదు. ఏ విషయాన్నైనా సరే సోషల్ మీడియా వేదికగా నిర్భయంగా ప్రశ్నిస్తుంది. ఇలా దూకుడు ప్రదర్శించే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా చెప్పాలంటే తన ముందు ఎంతటి వారు ఉన్నా సరే అసలు భయపడదు. ఇప్పటికే ఇలాంటి వాటిని చాలా సార్లు రుజువు చేసింది.

Kangana Ranaut

అయితే ఈ సారి కంగనా రనౌత్ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ సూపర్ స్టార్స్ 2కోట్ల పని 200 కొట్లు తీసుకుంటారని, షూటింగ్ ల కోసం కూడా తమ సొంత విమానాలను వాడుతుంటారని చెప్పుకొచ్చింది. ఇక అమీర్ ఖాన్ గురించి స్పందిస్తూ, బహిష్కరణ గురించి నాకు తెలియదు కానీ ఇండియా సంక్లిష్ట పరిసితులు ఎదుర్కొంటున్నప్పుడు టర్కీ మనకు వ్యతిరేకంగా పని చేసిందని మనకు తెలుసు.

కానీ అమీర్ ఖాన్ అక్కడికి వెళ్లి వాళ్ళతో ఫోటోలు తీసుకున్నారు. ఇలా ఈ ఒక్క విషయంలోనే కాదు మన దేశంపై అసహనం ఉందని చెప్పి మన దేశ గౌరవాన్ని తగ్గించారు. ఇక ఇటీవల విడుదలైన తన సినిమా గురించి కూడా కంగనా రనౌత్ మాట్లాడారు. అయితే లాల్ సింగ్ చడ్డా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టడంతో దానికి బాయ్ కాట్ పేరు చెప్పి తప్పించుకున్నారు. అయితే కథ బాగుంటే ప్రేక్షకులు ఎప్పటికి ఆదరిస్తూనే ఉంటారు కానీ దానికి బాయ్ కాట్ అని కారణం చెప్పుకుని తప్పించుకోవడం ఎందుకని ప్రశ్నించారు.

ఈ విషయాన్ని పక్కన పెడితే కంగనా రనౌత్ ఇప్పుడు ఇందిరా గాంధీ హయాంలో ఎదురైనా ఎమర్జెన్సీ ఆధారంగా వస్తున్నా సినిమా లో నటిస్తుంది. అయితే ఈ సినిమా లో ఇందిరా గాంధీ పాత్రను తానే స్వయంగా చేయడంతో పాటు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకుంది.

Similar Articles

Comments

తాజా వార్తల