Kanthara Movie: కొత్త రికార్డులను సృష్టిస్తున్న కాంతార…కేజీఎఫ్ 2 వెనక్కి నెట్టేసిందిగా…

Kanthara Movie: కొన్ని సార్లు ఏ అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలే బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంటాయి. అలా వచ్చిందే కాంతారా మూవీ. ముందు ఈ సినిమాకి ఎలాంటి అంచనాలు లేవు. కానీ తర్వాత క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయి పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా ని కన్నడ నటుడు రిషబ్ శెట్టి కథానాయకుడుగా తానే స్వయంగా దర్శకత్వం చేసారు. అయితే ఈ చిత్రాన్ని నిర్మించింది కెజిఎఫ్ ని నిర్మించిన హోం భలే సంస్థనే కావడం విశేషం.

kanthara-movie

అతి తక్కువ బడ్జెట్లో నిజ జీవిత కథల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అయితే మొదట్లో అంతగా సినిమా జనాల్లోకి వెళ్ళలేదు కానీ ఆ తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలై మూడు వారాల పైనే అయినా ఈ సినిమా క్రేజ్ తగ్గలేదంటే ఆ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే ఈ సినిమా తెలుగు తో పాటు ఇండియాలోని అన్ని భాషల్లో విడుదలైంది. ఈ సినిమా తెలుగు రైట్స్ ని అల్లు అరవింద్ కేవలం 2 కోట్లకు తీసుకున్నారు. అయితే తెలుగులో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో కలిపి మొత్తంగా 15 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టాయి. ఇక ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది.

చిత్ర పరిశ్రమలో కేజీఎఫ్, కేజీఎఫ్ 2 ఎంతటి విజయాల్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది కాంతారా సినిమా వసూళ్లు రాబట్టడంలో కేజీఎఫ్ 2 నే మించి పోయిందంటే ఈ సినిమా గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పటికే ఇన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కాంతారా మూవీ ముందు ముందు ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Similar Articles

Comments

తాజా వార్తల