Krithi Shetty: కృతి శెట్టి కొంప ముంచిన సూర్య.. స్టార్ హీరో నిర్ణయంతో షాక్‌లో యంగ్ బ్యూటీ

Krithi Shetty:న్యాచురల్ సినిమాలను తీస్తారని తమిళ దర్శకుడు బాలాకు మంచి పేరుంది. ‘శివపుత్రుడు’, ‘వాడువీడు’ లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఈ కోలీవుడ్ డైరెక్టర్‌కు ఫుల్ క్రేజ్‌ను తీసుకొచ్చాయి. సూర్య, విక్రమ్, విశాల్‌ లాంటి స్టార్లలో ఉన్న అసలైన నటనా పటిమను బయటకు తీసుకొచ్చిన క్రెడిట్ బాలాకే దక్కుతుంది. వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కించే బాలాకు.. కొన్నాళ్లుగా సరైన హిట్ పడలేదు. ‘వాడు-వీడు’ తర్వాత ఆ స్థాయి విజయాన్ని ఆయన అందుకోలేకపోయారు.

మంచి హిట్ మూవీతో కమ్ బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్న బాలా.. స్టార్ హీరో సూర్యతో జతకట్టారు. వీరి కలయికలో గతంలో వచ్చిన ‘నందా’, ‘శివపుత్రుడు’ సినిమాలు బంపర్ హిట్లుగా నిలవడంతో మళ్లీ ఓ చిత్రం చేయాలని వీళ్లిద్దరూ ఫిక్స్ అయ్యారు. హిట్ కాంబోలో 18 ఏళ్ల తర్వాత ‘అచలుడు’ అనే ప్రాజెక్టును మొదలుపెట్టారు. దీంతో మరో విలక్షణమైన సినిమా వస్తోందని అందరూ భావించారు.

బాలా మూవీ నుంచి సూర్య అవుట్..!
‘అచలుడు’ కోసం ఆడియెన్స్ అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న వేళ.. హఠాత్తుగా ఓ వార్త బయటికొచ్చింది. 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ మూవీ నుంచి సూర్య తప్పకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు బాలా తెలిపారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో బాలా ఓ లెటర్ ను పోస్ట్ చేశారు.

‘అచలుడు’ స్టోరీలో పలు మార్పులు చేయాల్సి వచ్చిందని.. దీంతో ఈ ప్రాజెక్టు కథ సూర్యకు సరిపోదని అనిపించిందని ఆ లేఖలో బాలా తెలిపారు. ‘పరస్పర అంగీకారంతోనే సూర్య ‘అచలుడు’ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. సూర్య తప్పుకున్నా ఈ చిత్రం మాత్రం కొనసాగుతుంది’ అని బాలా స్పష్టం చేశారు.

‘అచలుడు’ సినిమా నుంచి సూర్య అనూహ్యంగా తప్పుకోవడంతో.. ఇందులో హీరోయిన్ గా ఎంపికైన యంగ్ బ్యూటీ కృతి శెట్టికి ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. సూర్యతో చిత్రంతో ఓ రేంజ్ క్రేజ్ వస్తుందని అనుకున్న కృతి అటు ఇటు కాకుండా అడ్డంగా బుక్కయ్యిందని సినిమా జనాలు కామెంట్ చేస్తున్నారు.

Similar Articles

Comments

తాజా వార్తల