God Father: మెగాస్టార్ కెరీర్‌లో ‘గాడ్‌ఫాదర్’ మరో డిజాస్టర్‌గా నిలిచిందా?

God Father: మెగాస్టార్ చిరంజీవికి ఆచార్య తర్వాత వరుసగా మరో డిజాస్టర్ ఎదురైంది. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆచార్య తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుని పకడ్బందీగా తెరకెక్కించిన గాడ్ ఫాదర్ సైతం బయ్యర్లకు నష్టాలను మిగిల్చింది. పాజిటివ్ టాక్ కారణంగా తొలివారం చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఈ సినిమా వసూళ్లన సాధించింది. అయితే రెండో వారం నుంచి కలెక్షన్‌లు తగ్గుముఖం పట్టాయి.

godfather movie

ఈ నేపథ్యంలోమూడో వారం గాడ్ ఫాదర్ సినిమాను థియేటర్లలో కొనసాగించాలని ప్రయత్నించినా కొత్త సినిమాల ధాటికి చాలా చోట్ల ఈ సినిమాను ఎత్తేశారు. దాదాపుగా రూ.14.5 కోట్ల నష్టాన్ని ఈ సినిమా మూటగట్టుకున్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసీఫర్ మూవీని రీమేక్ చేసి గాడ్ ఫాదర్‌గా మలిచారు. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు.

దసరా సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన తెలుగు సహా హిందీ భాషల్లో విడుదలైంది. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.92 కోట్లు జరిగింది. మెగాస్టార్ మూవీ కావడంతో భారీ అంచనాల నడుమ ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో తొలి ఆరోరోజుల పాటు రూ.కోటికి పైగా షేర్ వసూలు చేసింది. పది రోజుల వ్యవధిలో సినిమాని తమిళ వర్షన్‌లో కూడా విడుదల చేశారు. తెలుగు వెర్షన్ కోసం దర్శకుడు మోహన్ రాజా చేసిన మార్పులు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గాడ్ ఫాదర్ సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.

గాడ్‌ఫాదర్ డిజాస్టర్‌కు కాంతార సినిమానే కారణమా?

కన్నడ డబ్బింగ్ మూవీ కాంతార టాలీవుడ్‌లో అనూహ్య విజయం సాధించింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. గాడ్‌ఫాదర్ డిజాస్టర్ కావడానికి కాంతార కారణమని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గాడ్‌ఫాదర్ మూవీతో సమానంగా కాంతార తెలుగులో రూ.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. మూడో వారంలోనూ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుండటం గమనించాల్సిన విషయం. ప్రస్తుతానికి మెగాస్టార్ ఆశలన్నీ సంక్రాంతికి విడుదల కానున్న వాల్తేరు వీరయ్య మూవీపైనే ఉన్నాయి.

Similar Articles

Comments

తాజా వార్తల