Mahesh & Trivikram: గుప్పెడు దుఃఖంలో మహేష్ బాబు అభిమానులు.. త్రివిక్రమ్ ఇంకోసారి అలోచించు..!

Mahesh & Trivikram: త్రివిక్రమ్ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్. తనదైన శైలిలో మాటలు రాయడం, సినిమాలో ప్రతి పాత్రను కొత్తగా తీర్చిదిద్దడం త్రివిక్రమ్ స్టైల్. ఇక ప్రాసలు.. పంచులు గురించి చెప్పనవసరం లేదు. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా త్రివిక్రమ్ అభిమానులు సినిమాను ఎంజాయ్ చేస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు అందరు టాప్ హీరోలతో ఈ మాటల మాంత్రికుడు సినిమా చేసాడు. మహేష్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్.. వంటి హీరోలతో డబుల్ ధమాకా మూవీలతో అలరించారు. అయితే కథ, కథనం, మ్యూజిక్, సినిమాలో పాత్రలతో పాటు.. సినిమా టైటిల్స్ పై త్రివిక్రమ్ చాలా వర్క్ చేస్తాడని టాక్. అయితే ఇప్పుడు ఆ టైటిల్ యే పెద్ద సమస్యగా మారింది. ఇంతకీ ఏంటా గొడవ.. మీరే చదవండి.

Mahesh and Trivikram

సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” తర్వాత.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో తన 28 వ సినిమా తీస్తున్నాడు. మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ నిరంతరాయంగా జరిగింది. కానీ ఈ మధ్యనే మహేష్ బాబు గారి అమ్మగారు చనిపోవడంతో సినిమా రెగ్యులర్ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మహేష్.. మళ్లీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు హాజరవుతారని టాక్. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.

ఇదిలా ఉంచితే.. ఇక ప్రస్తుతం జరుగుతున్న చర్చ అంతా ఆ సినిమా టైటిల్ గురించే. మహేష్ త్రివిక్రమ్ లు కలిసి చేస్తున్న మూడో చిత్రం ఇది. అయితే ఈ చిత్రానికి “అర్జునుడు” అని టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. దీని గురించే కొందరు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. అప్పట్లో మహేష్ బాబు తీసిన “అర్జున్” మూవీ మహేష్ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక అదే సెంటిమెంట్ తో ఇప్పుడు.. దానికి దగ్గరగా ఉన్న “అర్జునుడు” మూవీ కూడా ప్లాప్ అవుద్దేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కానీ దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది వరకు మహేష్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన “అతడు” ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసు. ఆ సినిమా టైటిల్ లో మొదటి అక్షరం “అ” చివరి అక్షరం “డు”. కాబట్టి అదే సెంటిమెంట్ తో ఇప్పుడు “అర్జునుడు” లో కూడా మొదటి అక్షరం “అ” చివరి అక్షరం “డు” వచ్చేలా సెట్ చేసారని టాక్. ఏదేమైనా.. ‘త్రివిక్రమ్ టైటిల్ గురించి ఇంకోసారి ఆలోచించు’ అంటూ.. కొందరు అభిమానులు మొర పెట్టుకుంటున్నారు.

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

తాజా వార్తల