Nandamuri Balakrishna: పవన్ కల్యాణ్ రికార్డును బద్దలు కొట్టిన బాలయ్య.. ఓవర్సీస్‌లో అదిరిపోయే ఘనత

Nandamuri Balakrishna: ఇటీవల టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేస్తోన్నారు మేకర్స్, బర్త్ డే సందర్భంగా స్పెషల్ షోస్ పేరుతో సినిమాలను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ బర్త్ డే రోజున జల్సా సినిమాను, సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే రోజున పోకిరి సినిమాను రీ రిలీజ్ చేశారు. బాగా హిట్ అయిన సినిమాలను రీ రిలీజ్ పేరిట మళ్లీ ప్రత్యేక షోలు వేస్తోన్నారు. ఇక ఇటీవల ప్రభాష్ బర్త్ డే సందర్భంగా బిల్లా సినిమాను థియేటర్లలో ప్రదర్శించారు.

ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమాను రీ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. అయితే ఇప్పుడు ఆ సినిమా విడుదలై 20 ఏళ్లు అవుతున్న క్రమంలో ప్రత్యేక షోలు వేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ షోలు వేయనున్నారు.

ఓవర్సీస్‌లో అత్యధిక షోస్

ఓవర్సీస్ లో ఏకంగా 35 షోస్ వేయాలని మేకర్స్ భావిస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్ జల్సా సినిమాను ఓవర్సీస్ లో 27 షోస్ వేశారు. ఇప్పుడు షోస్ పరంగా పవన్ రికార్డును బాలయ్య బద్దలు కొట్టనున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కలెక్షన్లపరంగా కూడా బాలయ్య రికార్డు సాధిస్తాడా.. లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. జల్సా స్పెషల్ షోకు ఓవర్సీస్‌లో 3 వేల టికెట్లు అమ్ముడవ్వగా.. 35 వేల డాలర్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇక మహేష్ బాబు పోకిరి సినిమా ప్రపంచవ్యాప్తంగా కోటి 75 లక్షల గ్రాస్ సాధించింది. అటు జల్సా సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో బాలయ్యకు మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అఖండ సినిమా కూడా ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు చెన్నకేశవ రెడ్డి సినిమా ప్రత్యేక షోస్ ద్వారా ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Similar Articles

Comments

తాజా వార్తల