Rashmika Mandanna: ‘కాంతార’ సినిమా గురించి అలా అన్న రష్మిక.. భగ్గుమంటున్న నెటిజన్లు!

Rashmika Mandanna: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందాన. తెలుగులో ‘ఛలో’ సినిమాతో బాగా ఫేమస్ అయిన ఈ హీరోయిన్.. ఇప్పుడు అగ్రహీరోలతో సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి.. ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారింది రష్మిక.

సినిమా రంగంలో ఇప్పుడు మంచి మార్పు వచ్చింది. ఏదైనా సినిమా బాగా ఉందంటే దానికి భాషలకు అతీతంగా అందరూ సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారైతే వేరే సినిమాలను కూడా ప్రమోట్ చేస్తున్నారు. కనీసం సినిమా బాగుందంటూ ప్రకటిస్తున్నారు.

ఇక ఇటీవల కన్నడలో వచ్చిన ‘కాంతార’ సినిమా విపరీతమైన పాజిటివ్ టాక్ తో దేశవ్యాప్తంగా సంచలనంగా మారడం తెలిసిందే. కన్నడలో అతి తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలై భారీగా కలెక్షన్లను రాబడుతుండటం తెలిసిందే. ఈ సినిమా గురించి దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి చెందిన అందరూ మెచ్చుకున్నారు. కానీ ఈ సినిమా విషయంలో రష్మిక మందాన స్పందించిన తీరు నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది.

తాజాగా ఓ కార్యక్రమానికి వచ్చిన రష్మికను ‘కాంతార’ సినిమా చూశారా? అని ప్రశ్నించగా.. ‘ఇంకా చూడలేదు’ అని పొగరుగా సమాధానం ఇచ్చింది. దీంతో నెటిజన్లు ఆమె మీద భగ్గుమంటున్నారు. అసలు రష్మిక ఇండస్ట్రీకి పరిచయం చేసిందే ‘కాంతార’ డైరెక్టర్ మరియు నటుడు రషబ్ శెట్టి. ఆయన తీసిన ‘కిరాక్ పార్టీ’తోనే రష్మిక హీరోయిన్ గా అడుగుపెట్టింది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన తీసిన సినిమా గురించి ఒక్కటంటే ఒక్క ప్రశంస కూడా చేయలేదనే కామెంట్లు వినిపిస్తోంది.

కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన రష్మిక.. అదే ఇండస్ట్రీ నుండి వచ్చి మంచి పేరు తెచ్చుకున్న ‘కాంతార’ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడకపోవడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. రష్మికకు అవకాశాలు ఎక్కువయ్యాయని, అందుకే ఆమెకు పొగరు తలకెక్కిందని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు మాత్రం వేరేలా అంటున్నారు. రష్మిక గతంలో ‘కాంతార’ డైరెక్టర్ రిషి శెట్టి సోదరుడు రక్షిత్ శెట్టిని ప్రేమించి, పెళ్లి కూడా చేసుకోవాలనుకోవడం.. ఆ తర్వాత గొడవల కారణంగా ఇద్దరూ విడిపోవడం తెలిసిందే. రక్షిత్ శెట్టితో సంబంధం కలిగి ఉన్నందుకే రష్మిక.. రిషబ్ శెట్టి తీసిన సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడట్లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Similar Articles

Comments

తాజా వార్తల