Samantha Yashoda Movie: ఓవర్సీస్‌లో భారీ ఓపెనింగ్స్.. మరోసారి దుమ్మురేపిన సమంత

Samantha Yashoda Movie: హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన యశోద ఇవాళ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో విడుదలైంది. సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన దీనికి హరి,హరీష్ కలిసి దర్శకత్వం వహించారు. ఒక సినిమాకు ఇద్దరు దర్శకత్వం వహించడం విశేషంగా చెప్పవచ్చు. సరోగసి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కగా.. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంటోంది.

రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా.. శాటిలైట్, ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్ముడిపోయాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరగడంతో సినిమాకు పెట్టిన డబ్బులు ఇప్పటికే నిర్మాతకు వచ్చేసినట్లుసినీ వర్గాలు చెబుతున్నారు. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు భారీ కలెక్షన్లు వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.2 కోట్ల వరకు షేర్ వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఇక సమంతకు ఉన్న క్రేజ్ కారణంగా ఓవర్సీస్‌లో కూడా సినిమాకు మంచి టాక్ వచ్చిందని చెబుతున్నారు. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ ద్వారా లక్షా 50 వేల డాలర్లు వచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

1 మిలియన్ క్లబ్‌కి చేరుకుంటుందా?

గతంలో సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఓ బేబీ ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. యశోద సినిమాకు కూడా మంచి టాక్ రావడంతో ఈ సారి కూడా వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. గతంలో సమంత నటించిన సినిమాలన్నీ ఓవర్సీస్ లో బాగా కలెక్షన్లను రాబట్టాయి. దీంతో యశోద సినిమాకు కూడా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తోన్నాయి. దీంతో ఓవర్సీస్ క్వీన్ అని మరోసారి సమంత నిరూపించుకోబోతుందంటూ చెబుతున్నారు. శనివారం, ఆదివారం వీకెండ్స్‌లో కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశముందని సినిమా యూనిట్ అంచనా వేస్తోంది. వరి చూాడాలి సమంత సినిమాకు కలెక్షన్లు ఎంతవరకు వస్తాయో..

Similar Articles

Comments

తాజా వార్తల