Kamal hasan: తల్లిదండ్రులు విడిపోవడానికి కారణం చెప్పిన స్టార్ హీరోయిన్

Kamal hasan: సినిమా పరిశ్రమలో విడాకుల వ్యవహారం చాలా సాధారణమైపోయింది. చిన్న చిన్న విషయాలకు కూడా విడిపోవడం పెరిగిపోయింది. ఇలాంటి జాబితా చాలానే ఉంది. లోక నాయకుడు కమల్ హాసన్ జీవితంలోనూ ఇలాంటి ఘటనలు మూడు సార్లు జరగడం విశేషం.

విశ్వనటుడు కమల్ హాసన్ 1978లో డ్యాన్సర్ వాణిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి కొన్ని సంవత్సరాలపాటు సంతోషంగా తమ జీవితాన్ని గడిపారు. ఇక వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వీరిద్దరూ 1988 లో విడిపోయారు. ఆ తర్వాత అదే ఏడాది మరొక నటి సారికను పెళ్లి చేసుకున్నాడు. వీరికి శృతిహాసన్, అక్షరహాసన్ సంతానం కలిగింది. అయి 2004లో సారికతోనూ విడాకులు తీసుకున్నాడు కమలాసన్. ఆ తర్వాత గౌతమితో సహజీవనం, పెళ్లి చేసుకుని దూరమయ్యాడు.

సారికతో విడాకులకు కారణం ఇదేనా?
క‌మ‌ల్ హాస‌న్ సినిమాల‌కు సారిక డిజైన‌ర్‌గా ప‌నిచేసేది. ప‌దిహేనేళ్ల వర‌కూ వీరి జంట హ్యాపీగా గ‌డిపింది. కానీ ఆ త‌ర‌వాత ఇద్ద‌రి మ‌ధ్య వివాదాలు రావ‌డంతో 2004 లో విడాకులు తీసుకున్నారు. త‌మ తల్లిదండ్రులు విడిపోవ‌డానికి కార‌ణం వారిద్ద‌రి అభిప్రాయాలు క‌ల‌వ‌క‌పోవ‌డ‌మే అని శృతిహాస‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. వారు సామరస్యంగానే విడిపోయారని, ఎలాంటి గొడవలు లేవని చెప్పింది. పిల్లలిద్దరినీ వారు బాగా చూసుకుంటారని కూడా తెలిపింది.

Kamal hasan: పెళ్లిపై శృతి అభిప్రాయమిదే?

ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తున్న శృతి హాసన్ కూడా డేటింగ్ చేస్తున్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కథనాలు వచ్చాయి. అయితే ఆమె ఓ ఇంటర్వ్యూలో తనకు పెళ్లంటే భయమని చెప్పింది. తమ పేరెంట్స్ విడిపోయారన్న కారణంగా తాను ఈ అభిప్రాయానికి రాలేదని, తెలియకుండానే పెళ్లి విషయంలో ఆందోళనకు గురవుతున్నానని శృతి చెప్పుకొచ్చింది. కాగా ఆమె హజారిక అనే వ్యక్తితో రిలేషన్‌తో ఉన్న విషయం తెలిసిందే.

Similar Articles

Comments

తాజా వార్తల