Sradda Das: నటి శ్రద్ధా దాస్, వరుణ్ సందేశ్ స్టోరీ తెలుసా.. వారి బ్రేకప్ కథ ఇదీ..

Sradda Das: ముంబైలో పుట్టి పెరిగిన నటి శ్రద్ధా దాస్ తెలుగు ప్రేక్షకులకూ కూడా సుపరిచితురాలే. టాలీవుడ్ లో అనేక చిత్రాల్లో శ్రద్ధా దాస్ నటించింది. సిద్ధు ఫ్రం శ్రీకాకుళం సినిమాలో తొలిసారి తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టింది శ్రద్ధా దాస్. ఆమె బాల్యం, విద్యాభ్యాసమంతా ముంబైలోనే సాగింది. చిన్నతనం నుంచే నటనపై మక్కువ కలిగి ఉండేది. తన గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వర్క్ షాప్స్ కు అటెండ్ అయ్యేది.

sharadha das

తెలుగులో తొలి సినిమా చేయగానే వరుసగా అవకాశాలు ఆమెకు దక్కాయి. డైరీ, అధినేత, ఆర్య 2 చిత్రాల్లో శ్రద్ధ నటించింది. కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలైనా కూడా నటించేందుకు ఒప్పుకొని మెప్పించింది. హీరోయిన్ గా మాత్రమే చేయాలనే నిబంధన పెట్టుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంది. ఈ కారణంతోనే ఆమె అగ్ర హీరోయిన్ కాలేకపోయిందనే వాదన ఉంది. తెలుగుతో పాటు కన్నడ, బెంగాలీ, హిందీ మూవీల్లో సుమారు 30 సినిమాల్లో శ్రద్ధ నటించింది.

టాలీవుడ్ లో నటిస్తున్న క్రమంలో శ్రద్ధపై వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అప్పట్లో హీరోగా పాపులర్ అయిన వరుణ్ సందేశ్ తో ప్రేమాయణం నడిపిందనే వార్తలు హల్ చల్ చేశాయి. 2010లో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన మరో చరిత్ర సినిమాలో మంచి గుర్తింపు ఉన్న పాత్రలో శ్రద్ధ నటించింది. అప్పటి నుంచి వారి మధ్య పరిచయం పెరిగి కొన్నాళ్లకు ప్రేమగా మారిందని చెబుతారు.

ఆ వార్తలు నిజమే.. విడిపోయాం..

ఓ ఏడాది తిరిగేలోపే ఇలాంటి వార్తలు మరింత పెరిగాయి. అయితే, వారి ప్రేమకు వరుణ్ సందేశ్ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారనే టాక్ నడిచింది. అయితే, కొన్నేళ్ల తర్వాత శ్రద్ధా దాస్ దీనిపై వివరణ ఇచ్చింది. తాను వరుణ్ సందేశ్ కొంత కాలం ప్రేమలో ఉన్నామని చెప్పింది. తర్వాత కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యిందని వెల్లడించింది. తర్వాత వరుణ్ సందేశ్ 2015లో వితికను పెళ్లాడి సెటిలయ్యాడు.

Similar Articles

Comments

తాజా వార్తల